Advertisement
శ్రీమంతుడు కోసం కొరటాల శివపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమాకు మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. అయితే.. ఈ కేసు వివాదం నుంచి మహేష్ బాబు తప్పుకున్నారు. అయితే దీని వెనుక ఆయన భార్య నమ్రత గారి తెలివితేటలు ఉన్నాయట. నమ్రతగారు చాలా తెలివైన వారు అని గతంలో ఆమె మామగారు సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా సార్లే చెప్పారు. ఈ ఒక్క ఇన్సిడెంట్.. ఆమె ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారో తెలియచెప్తుంది.
Advertisement
స్వాతి పత్రికలో వచ్చిన తన కథను శ్రీమంతుడు సినిమాకు ఉపయోగించారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో కొరటాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో డైరెక్టర్ గా ఉన్న కొరటాల మాత్రమే ఇరుక్కున్నారు. ప్రొడ్యూసర్స్ లో ఒకరైన మహేష్ బాబుని మాత్రం నమ్రత తెలివి గా తప్పించారట. మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఓనర్ పేరుని నమ్రత గారు మార్పించారు. ఆ సంస్థ ఓనర్ గా గంగాధర్ అనే వ్యక్తి పేరుపై మార్పించారు.
Advertisement
దీనితో శ్రీమంతుడు సినిమా ఒకరైన ప్రొడ్యూసర్స్ గా గంగాధర్ అనే వ్యక్తి ఉంటారు. కోర్టు కు సబ్మిట్ చేసిన డాక్యూమెంట్స్ అన్నిటిలో గంగాధర్ అన్న పేరే ఉంటుంది. కోర్టుకు కావాల్సిన ఫిజికల్ సాక్ష్యాలు మాత్రమే. ఈ సినిమాకి నిర్మాతగా మహేష్ బాబు వ్యవహరించలేదు అని, గంగాధర్ అనే వ్యక్తి వ్యవహరించారని.. ఈ కేసుకి మహేష్ బాబుకి సంబంధం లేదు అంటూ కోర్టులో వాదన జరిగింది. దీనితో ఈ కేసు నుంచి కోర్టు మహేష్ బాబుని తప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా సూపర్ స్టార్ కృష్ణ గారు నమ్రత గారిని ఎందుకు అన్ని సార్లు మా కోడలు తెలివైన పిల్ల అని పొగిడేవారో.
Read More:
1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హరి కృష్ణ కి జరిగిందే మళ్ళీ షర్మిల కి జరగబోతుందా ?
యాత్ర 2 సినిమాలో షర్మిల, లోకేష్, పవన్ క్యారెక్టర్లని ఎందుకు పెట్టలేదో తెలుసా ?
హనుమాన్ సినిమాలో “రుధిరమణి” వెనుక ఇంత కథ జరిగిందా? ఈ సినిమా కోసం ఇన్ని తయారు చేసారా?