Advertisement
కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకుకి తల్లి ముఖ్య విషయాలు చెప్పింది. ప్రతి తల్లి కూడా ఏ విధంగా కొడుకుకి చెప్తే ఇంకా అంతా మంచే జరుగుతుంది. ఏ కష్టాలు రావు. ఏ ఇబ్బందులు ఉండవు. మరి కొత్తగా పెళ్లయిన కొడుకుకి తన తల్లి చెప్పిన ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడే చూసేద్దాం….
Advertisement
- నీ భార్యను ఎప్పుడూ కూడా నాతో పోల్చకు. ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ నీ భార్య కి ఇంకా అంత అనుభవం లేదు. నిన్ను నేను ఎలా పెంచానో తనని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలానే పెంచుతారు. ఆమె కి అయ్యే వరకు కూడా ఆమె ని నువ్వే మంచిగా చూసుకోవాలి. తప్పకుండా తను కూడా మంచి గృహిణి అవుతుంది. అలానే మంచి తల్లిగా కూడా తన బాధ్యతలు ని నెరవేరుస్తుంది.
- ఎప్పుడు కూడా మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా అన్నీ కూడా తన తో షేర్ చేసుకో. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని. అయితే నీవు మమ్మల్ని, నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
- పుట్టింటి నుంచి ఆమె వచ్చింది. ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. అందుకే నువ్వే జాగ్రత్తగా చూడాలి. ఆమె కి కాస్త మోహమటంగా ఉంటుంది. నువ్వే తనకి తోడుగా ఉండాలి. తను సంతోషంగా ఉండేటట్లు చూడాలి.
- నీతో సమానంగా తనని చూసుకో. నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఏమైనా సరే తన తో చర్చించి ఓ నిర్ణయానికి రండి. మంచి చెడు లో జీవితాంతం తోడుగా తనే ఉంటుంది. భార్యను మాకంటే ఎక్కువగా ప్రేమించాలి నువ్వు.
- వారం లో ఒకసారి బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో వెళ్ళు. నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు దొరకడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం. ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను. అనుభవిస్తున్నాను. నా అనుభవాలను నీతో చెపుతున్నాను. నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ, సంతోషంగా ఉండాలి.
Advertisement
నిజానికి ప్రతి కొత్తగా పెళ్లయిన అమ్మాయి అత్తవారింట్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అటువంటి సమయంలో అత్తవారింట్లో వాళ్ళు భర్త తోడుగా ఆమెకి ఉండాలి. ఈ తల్లి చెప్పిన విషయాలని అందరూ పాటిస్తే ఏ మహిళకి కూడా కష్టాలు ఉండవు. చక్కగా సంతోషంగా ఉంటుంది పైగా భర్త సపోర్ట్ ఉంటే భార్య ఏమైనా చేయగలదు. భర్త సపోర్ట్ భార్యకి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్క భర్త కూడా ఈ అమ్మ చెప్పినట్లు పాటించినట్లయితే భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!