Advertisement
ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో రాజకీయ పార్టీలు స్పీడ్ ని పెంచేసాయి. ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళా రాజకీయ పార్టీల మధ్య వార్ కూడా బాగా నడుస్తోంది. ముఖ్యంగా విపక్షాల దూకుడుని అడ్డుకోవడానికి సీఎం జగన్ అయితే విపరీతంగా ట్రై చేస్తున్నారు. జగన్ మరో సారి భారీగానే ప్లాన్ వేస్తున్నారు. ఢిల్లీ లోని బిజెపి తో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి చర్చలు జరుపుతున్నారు. అదే సమయం లో రాష్ట్రం లో కీలక పరిణామం చోటు చేసుకుంది దీనితో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
Advertisement
ఇక వివరాలు చూస్తే.. ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో రాజకీయ పార్టీలు స్పీడ్ కూడా బాగా పెరిగింది. చంద్ర బాబు నాయుడు కి తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి రింగ్ రోడ్ కేసు లో సిఐడి విజయవాడ కోర్టు లో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు ఢిల్లీ లో బిజెపి తో చర్చల్లో మునిగి తేలుతున్న టైం లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈ కేసు లో చంద్రబాబు నాయుడు తో పాటు మాజీ మంత్రి నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్ తో పాటుగా పలువురి పేర్ల ను దీనిలో ప్రస్తావించింది.
Advertisement
అప్పట్లో సిఎంగా చంద్రబాబు మున్సిపల్ మంత్రిగా నారాయణ సిఆర్డిఏ కి ఎక్స్ అఫీషియో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ హోదాల్లోని సింగపూర్ ప్రభుత్వానికీ అలానే ఏపీ ప్రభుత్వానికీ మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అగ్రిమెంట్ జరిగింది. కేబినెట్ కి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ చెప్తోంది. కానీ అలాంటి ఒప్పందమేమీ జరగలేదని.. ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని చెపుతోంది సీఐడీ. కేవలం నామినేషన్ ప్రాతిపదికన సింగ పూర్ సంస్ధ సుర్బానా జురాంగ్ కి పనులు అప్పగించినట్లు చెప్పింది. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క టికెట్ కోసం పోటీ పడుతున్నారు నాయకులు టికెట్ రాకపోయినా రాదని తెలిసినా పార్టీ లు మారుతున్నారు. ఈ పార్టీ నుండి ఆ పార్టీ కి జంప్ చేస్తూ వార్తల్లో కి ఎక్కుతున్నారు పార్టీ నాయకులు.
పాలిటికల్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!