Advertisement
యాత్ర టు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 2019లో యాత్ర సినిమాని తెర మీదకు తీసుకువచ్చారు ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా యాత్ర 2 ని తెర మీదకి తీసుకు రావడం జరిగింది. యాత్ర 2 సినిమాకి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. యాత్ర టు సినిమాలో వైయస్ రాజశేఖర్ 2009 ఎన్నికల్లో విజయాన్ని సాధించడం నుండి 2019 ఎన్నికల్లో సీఎం గా జగన్ విజయాన్ని అందుకునే వరకు జరిగిన పలు సంఘటనల ఆధారంగా సినిమాని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయినట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు యాత్ర టు లో మిస్ అయిన లాజిక్స్ ఏంటి అనేది ఇప్పుడే చూసేద్దాము.
Advertisement
ఎప్పుడో యాత్ర టు సినిమా రిలీజ్ అవ్వాలి కానీ సినిమా ఏవో పలు కారణాల వలన రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అవుతూ ఉంది. కానీ ఇప్పుడు యాత్ర టు రిలీజ్ అయిపోయింది యాత్ర టు పూర్తి కన్వీనియంట్ వన్ సైడ్ బయోపిక్ అనడానికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి జగన్ కి ప్రతికూలమైన చంద్రబాబునాయుడు, సోనియాగాంధీ వంటి వాళ్ళని విలన్లుగా చూపించారు దర్శకుడు. జగన్ కి ఇబ్బంది కలిగించే వ్యక్తుల పాత్రలని ఈ సినిమాలో లేకుండా చూసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా జగనన్న వదిలిన బాణాన్ని అని జగన్ జైల్లో ఉండగా కష్టపడి పాదయాత్ర చేసిన వైయస్ షర్మిల ఈ సినిమాలో షర్మిల ఆనవాళ్లు కూడా లేకుండా సినిమాని తీశారు. ఇంకో పక్క జగన్ జైలుకు వెళ్లినప్పుడు తల్లి విజయమ్మ భార్య భారతిని ఆయన కోసం పోరాడినట్లు చూపించారు.
Advertisement
విజయమ్మ జనాల్లో తిరిగినట్లు చూపించారు ఇంకో వైపు పవన్ కళ్యాణ్ వైఎస్ వివేకానంద రెడ్డి పాత్రలు కూడా ఈ సినిమాలో కనపడలేదు. అయితే ఒక చోట మాత్రం చంద్రబాబు పాత్రలో ఒక వైపు బిజెపిని జాతీయ పార్టీ మరోపక్క జనసేన ని తల తోక లేని పార్టీ అని పరోక్షంగా పవన్ మీద కౌంటర్ వేయించారు దర్శకుడు. అయితే ఈ సినిమాలో కేవలం జగన్ హీరోగా మాత్రమే చూపించాలని తీశారు. ఇంకో పక్క వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లే టైంలో రాజశేఖర్ రెడ్డి జగన్ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు.
తర్వాత హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని టీవీ లో చూపించినప్పుడు రియల్ లైఫ్ లో జగన్ ఇంట్లోనే ఉన్నాడు కానీ బయోపిక్ లో మాత్రం జగన్ ఇడుపులపాయికి వెళ్లినట్లు ప్రమాదం జరిగినా ప్రదేశాన్ని వీక్షించినట్లు చూపించారు. యాత్ర టు మూవీలో చాలా సీన్లలో లాజిక్ నేను మిస్ అయ్యారు ప్రస్తుతం ఈ లాజిక్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!