Advertisement
ఈరోజుల్లో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నిజానికి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవడానికి చూడాలి. మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎటువంటి సంకేతాలు కనబడతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ సంకేతాలు కనుక కనపడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన శరీరంలో కనిపించే జిగటమైనటువంటి కొవ్వు పదార్ధము. విటమిన్ డి అలానే కొన్ని హార్మోన్ల కి కొలెస్ట్రాల్ ఉపయోగ పడుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది నీటిలో కరగదు. అందువలన అది తనంతట శరీరం లోని ఇతర భాగాలకి చేరుకోలేదు.
Advertisement
అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లయితే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం వుంది. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ముందగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని లక్షణాలు గురించి ఇప్పుడు చూద్దాం. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళల్లో అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఉంటాయి. అలానే ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళకి అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం వలన ఛాతి నొప్పి, అశాంతి, అలసట ఇటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో ఈ ఇబ్బందులు ఉన్నట్లయితే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో మీరు బాధపడుతున్నట్లు తెలుసుకోవాలి. పాదాలు వాచినా కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లు మీరు గ్రహించాలి.
Advertisement
కాళ్లు బరువెక్కుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఈ సమస్య కావచ్చు. అధిక కొలెస్ట్రాల స్థాయిలు ఉన్న వ్యక్తులకి అవయవాల్లో మంట, నొప్పి వంటి కంప్లైంట్ లు ఉంటాయి తొడల్లో నొప్పి కలగడం వంటివి కూడా కలుగుతాయి. గోళ్లు రంగు మారడం వంటివి కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలే. రక్తాన్ని మోసే పోషకాలు ఆక్సిజన్ లేకపోవడం వలన కణాలు సరైన పోషకాహారాన్ని పొందలేకపోతు ఉంటాయి. అలానే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే పాదాలు సాధారణంగా కంటే చల్లగా మారుతాయి. తగినంత నిద్ర, ఉదయాన్నే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం, కొలెస్ట్రాల్ లేని ఆహార పదార్థాలు తీసుకోవడం వంటి పద్ధతుల్ని పాటిస్తే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుండి బయటపడొచ్చు. బాగా సమస్య ఎక్కువగా ఉన్నట్లు మీరు గ్రహిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!