Advertisement
తల్లిదండ్రులు పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని చూస్తారు. పుట్టిన పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని తల్లిదండ్రులు బాగా వెతికి వెతికి ఆలోచించి పెడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే తల్లి, తండ్రి పేరు కలిసే విధంగా పెడుతూ ఉంటారు కొంతమంది దేవుడి పేర్లు ని పెడుతూ ఉంటారు ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పిల్లలకి పేర్లు పెడతారు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా నిషేదించబడిన పేర్ల గురించి చూద్దాము… ఈ పేర్లను పొరపాటు కూడా పిల్లలకి పెట్టకూడదు. ఈ పేర్లని కనుక పిల్లలకి పెట్టారంటే చర్యలు తప్పవు. అమెరికాలోనే బ్రిటన్లలో ఈ పేర్లపై రిజిస్ట్రేషన్ అందుబాటులో లేవు. రిజిస్ట్రేషన్ లేకపోతే పిల్లలకి సౌకర్యాలు అందవు. డైలీ స్టార్ కథనం ప్రకారం బ్రిటన్ నుండి చూసినట్లయితే ఇక్కడ ఇంటిపేర్లు పెట్టుకోవడం పై ఎటువంటి ఆంక్షలు లేవు.
Advertisement
కానీ రిజిస్టర్ ఎటువంటి పేర్లను స్వీకరిస్తారో చూడాలి. పేర్లలో అక్షరాలు ఉండాలి. అభ్యంతరంగా ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి తగిన విధంగా ఉపయోగించాలి. వీటి వలన విపత్తు జరగకూడదు రిజిస్ట్రేషన్ పేజీలో అందించిన స్థలంలో సరిపోయేంత పొడుగ్గా పేరు ఉండాలి. పేరు చాలా పెద్దది అయితే రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. || లేదా ||| ప్రత్యాయాన్ని జోడించొచ్చు. అమెరికా విషయానికి వచ్చేసినట్లయితే యూఎస్ జనన ధ్రువీకరణ పత్రం ప్రకారం మీరు నిర్దిష్ట పేర్లను ఉంచలేరు వీటిలో కింగ్ జీసస్ ఇలా పలు పేర్లు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇంతకంటే కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి.
Advertisement
చాలా చోట్ల పేర్లను నిషేధించి చట్టాలు కూడా ఉన్నాయి కొన్ని దేశాల్లో పేరు మార్చుకోవాలంటే కోర్టు లో పిటిషన్ వేయాలి. అక్కడ తిరస్కరించబడితే మీరు పేరు మార్చలేరు. మీ దేశంలో ఇలా పేర్లపై పలు కంట్రీస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి అలానే కొన్ని పేర్లని కొన్ని దేశాల వాళ్లు నిషేధించాయి అవి కూడా చూద్దాము… మాక్సిమస్ (న్యూజిలాండ్), రోబోకాప్ (మెక్సికో), సె=క్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్) అలానే లిండా (సౌదీ అరేబియా), స్నేక్ (మలేషియా), ఫ్రైడే (ఇటలీ) వంటివి పెట్టుకోకూడదు. ఇస్లాం- ఇస్లాం (చైనా), బ్లూ (ఇటలీ), సున్తీ (మెక్సికో), ఖురాన్ (చైనా), హ్యారియెట్-హ్యారియెట్ (ఐస్లాండ్),
సారా (మొరాకో), ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ), మెటాలికా (స్వీడన్), ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్), డెవిల్ (జపాన్), మంకీ (డెన్మార్క్) ఇలా కొన్ని వున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!