Advertisement
సాధారణంగా ఏ రంగంలో అయినా సరే వారసత్వం అనేది వస్తు ఉంటుంది. చాలా మంది హీరోలు వాళ్ల కొడుకుల్ని మనవాళ్ళని కూడా హీరోలుగా చేశారు. సినీ రంగంలో వారసత్వం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. ఒక రంగంలో స్థిరపడిన తర్వాత వాళ్ళని మళ్లీ అదే రంగంలో తీసుకువస్తూ ఉంటారు. అలా చాలా సినీ ఫ్యామిలీస్ సినీ పరిశ్రమలోకి వచ్చే విజయాన్ని సాధించారు. సాధారణంగా ఏ రంగంలో అయినా సరే వారసత్వం బాగా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు ఒక రంగంలో ఉంటే ఆ రంగంలో తదుపరి వాళ్ళు అడుగు పెడుతూ ఉంటారు ఇలా వారసత్వంగా వచ్చిన వాళ్ళు సక్సెస్ ని కూడా ఈజీగా అందుకుంటారు. రాజకీయాల్లో కూడా మనం వారసత్వాన్ని చూస్తూ ఉంటాము అలా చాలామంది రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు.
Advertisement
వీటిని చదవండి: Devi Movie Child Artist: దేవి సినిమాలో నటించిన ఆ పిల్లోడు.. ఇప్పుడు పెద్ద హీరో..!
వ్యాపార రంగంలో రాణించే వారు కూడా వారసత్వాన్ని ఫాలో అవుతూ ఉంటారు వ్యాపారం లో వారసత్వం నుండి వచ్చిన వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతూ ఉంటారు కూడా. అయితే సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే వారసత్వం పనికొస్తుంది కానీ సక్సెస్ అవ్వాలంటే హ్యాండ్సమ్ గా ఉండాలి. టాలెంట్ ఉండాలి. డాన్స్లు ఫైట్లు చేయగలగాలి డైలాగ్ డెలివరీ బాగుండాలి. ఇలా అన్నిట్లో కూడా బాగుంటేనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి అవుతుంది. వీటన్నిటితో పాటుగా మంచి సినిమాని ఎంచుకునే తెలివితేటలు కూడా ఉండాలి. స్టార్ హీరోగా ఎదగాలంటే ఎన్నో స్కిల్స్ కావాలి. వారసత్వం అనేది మూవీ ఇండస్ట్రీలకి ఎంట్రీ పాస్ వంటిదని చెప్పచ్చు.
Advertisement
వీటిని చదవండి: విచిత్రమైన జబ్బులతో బాధపడుతున్న ఇండియన్ సినిమా సెలెబ్రిటీలు వీరే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!
స్టార్ హీరో కొడుకు అయితే సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అభిమానులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణరావు మాత్రం వారసత్వం వలన స్టార్ కిడ్స్ స్టార్ హీరోలుగా మారుతున్నారని ఒకానొక టైంలో అన్నారు స్టార్ కిడ్స్ ఫెయిల్యూర్ సక్సెస్ ని పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారని దాసరి నారాయణరావు అన్నారు. ప్రేక్షకులు కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారని అన్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న స్టార్ హీరోల్లో చాలామంది ఇదే టైప్ అన్నారు. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలంటే పదేళ్లు పడుతుంది. మోహన్ బాబు కి ఐదేళ్లు పట్టిందని అన్నారు. దాసరి తన కొడుకుని కూడా హీరోగా నిలబెట్టాలంటే తను నిలబెట్టగలనని బ్యాగ్రౌండ్ తో హీరో చేయడం ఇష్టం లేదని దాసరి నారాయణరావు ఓ నాడు అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!