Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. పైగా ఎంతో మంది అభిమానుల హృదయాలని గెలుచుకున్నారు మహేష్ బాబు. రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో మన ముందుకు వచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు భార్య నమ్రత గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. నమ్రత మహేష్ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వంశీ సినిమా షూటింగ్ టైం లో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది అది పెళ్లి వరకు దారి తీసింది. అయితే ప్రతి భర్త భార్య మధ్య కొన్ని కండిషన్స్ ఉంటూ ఉంటాయి.
Advertisement
అలానే ప్రతీ భార్యా భర్త ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అలానే పెళ్లికి ముందు నమ్రత మహేష్ బాబు కి ఒక కండిషన్ పెట్టారట ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి ముందు వరకు నమ్రత కొన్ని మూవీస్ చేసారు.పెళ్లి తర్వాత ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు. ఒక ఇంటర్వ్యూలో నమ్రతమహేష్ బాబుకి సంబంధించి ఈ విషయాన్ని మాట్లాడారు. తనకి ఉద్యోగం చేసే భార్య వద్దు అని మహేష్ బాబు ముందు చెప్పారట. ఈ విషయం మీద వాళ్ళు మాట్లాడుకున్నారట. అయితే నమ్రత శిరోద్కర్ కూడా ఒక కండిషన్ పెట్టారు. తనకు బంగ్లాలో ఉండడం ఇబ్బందిగా ఉంటుందని అందుకని పెళ్లయిన తర్వాత కొన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉండాలని కండిషన్ పెట్టారట.
Advertisement
ఈ కండిషన్ కి మహేష్ బాబు ఒప్పుకున్నారు మహేష్ బాబు కి ఉద్యోగం చేసే భార్య వద్దు అనే కండిషన్ ని నమ్రత రెస్పెక్ట్ చేశారు అలా వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయ్యాక నమ్రత గౌతమ్, సితార ని చూసుకుంటున్నారు అలానే మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలని కూడా ఈమె చూసుకుంటున్నారు. ఇలా పనులతో బిజీగా ఉంటుంటారు పెళ్లి అయ్యాక కూడా నమ్రతకి పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ నమ్రత వాటిలో నటించడానికి ఒప్పుకోలేదు. ఎలాంటి పాత్ర వచ్చిన కూడా సినిమాల్లో కనపడాలని ఆమె అనుకోలేదు సినిమాల్లో నటించక పోయినా కూడా సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్తాను అని ఆమె అన్నారు. మహేష్ బాబు సినిమా షూటింగ్స్ కి తాను వెళుతూ ఉంటారు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!