Advertisement
ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి ప్రచారాన్ని కూడా జోరుగా మొదలుపెట్టేసారు. ఏపీలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపికతో పొత్తుల పైన తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీ అధినేతలు అలానే ఆశావాహులు కేడర్ తో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ ఉంది. ఈ పొద్దు చర్చల్లో గతవారం ఒక కీలక అడుగు పడింది టిడిపి అధినేత చంద్రబాబుకి హస్తిన నుండి పిలుపు వచ్చింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో సమావేశం అయ్యారు ఆ తర్వాత వెంటనే పొత్తు గురించి గ్రాండ్ అనౌన్స్మెంట్ ఉంటుందని అందరూ కూడా ఆశించారు కానీ రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.
Advertisement
దీంతో భేటీ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి టిడిపి జనసేనతో కలిసి ఎన్నికలు గోదాలోకి దిగడానికి బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అసెంబ్లీ సీట్లు లోక్ సీట్లు అని ఇంకా ఎక్కువగా బీజేపీ కోరుతుందని చర్చ జరిగింది. అమిత్ షా ఒక టీవీ ఇంటర్వ్యూలో లైవ్ డిబేట్లో ఎన్డీఏలోకి ఇంకా కొంతమంది మిత్రులు వస్తున్నారని అన్నారు ఏ పార్టీలు వస్తున్నాయి అనేది చెప్పలేదు. చంద్రబాబు తర్వాత సీఎం జగన్ కూడా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆయన కూడా ఎన్డీఏలోకి రావడానికి సముఖత వ్యక్తం చేశారని అందుకే బీజేపీ ఇటు జనసేన టిడిపి కూటమిలోకి వెళ్లాలా లేదంటే వైసీపీతో బరిలోకి దిగాలా అనే దానిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
జగన్ పర్యటన పొత్తుల కోసం కాదని పెండింగ్ సమస్యల మీద మాట్లాడ్డానికి వైసిపి స్పష్టం చేసిన చర్చ మాత్రం సాగుతోంది. జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ ని చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కూటమి ఎన్ని సీట్లు గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని కండిషన్ అమిత్ షా చంద్రబాబు ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ కనుక ఈ హామీ ఇచ్చారంటే కాపులు ఓట్ల ని కూటమికి పడతాయని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే సీఎం సీటు పంపకంపై టిడిపి జనసేనలు ఒక అగ్రిమెంట్ కి వచ్చినా తమకేమీ అభ్యంతరం లేదని అన్నారట మొదటి ఆరు నెలలు పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ సీఎం బాధ్యతలు తీసుకున్న సమ్మతమేనని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కండిషన్ పై చంద్రబాబు నాయుడు ఎటు తేల్చలేకపోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!