Advertisement
కీరవాణి గురించి తెలియని వారు ఉండరు. కీరవాణి ఎన్నో సినిమాలకి సంగీతాన్ని అందించారు. మన సినిమాల్లో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అంతా కాదు ముఖ్యంగా మన సినిమాల్లో పాటలు తప్పక ఉండాలి. అవి చాలా అందంగా వినసొంపుగా ఉండాలి సినిమాలో పాటలు బాగుంటే కూడా సినిమా పై అది మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది కీరవాణి ఇప్పటికే చాలా సినిమాల్లో పని చేశారు. సంగీత దర్శకులుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఇప్పటిదాకా కీరవాణి చేసిన ట్యూన్స్ అన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు సంగీత దర్శకులు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ నుంచో ట్యూన్స్ ని తెచ్చి మళ్ళీ వాటిని మనం ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అలా కొంతమంది సంగీత దర్శకులు కాపీ ట్యూన్స్ ని సినిమాల్లో పెట్టారు.
Advertisement
Advertisement
అప్పుడప్పుడు ఈ విషయాలు కూడా వార్తల్లో వస్తూ ఉంటాయి అలా జర్మనీ నుండి వచ్చిందే తెలుసా మనసా పాట ట్యూన్. నాగార్జున హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో క్రిమినల్ సినిమా వచ్చింది ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడుగా వ్యవహరించారు ఈ సినిమాలో తెలుసా మనసా పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ పాట హిందీలో కూడా ఫేమస్ అయ్యింది. అయితే నిజానికి ఈ పాటని జర్మనీ నుండి తీసుకొచ్చేశారు కీరవాణి మ్యూజిక్ ని కాపీ కొట్టిన పాటలో ఒక ఫ్రెష్ నెస్ ని తీసుకువచ్చారు కీరవాణి.
ఈ పాట పెద్ద సెన్సేషన్ గా అప్పట్లో మారిపోయింది ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా ఈ పాటను తీసుకొచ్చారు. మొదట ఈ ట్యూన్ ని జగపతిబాబు హీరోగా కె రాఘవేంద్రరావు రూపొందించిన అల్లరి ప్రేమికుడు సినిమాలో పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ సన్నివేశానికి ఇది సరిపోదని అక్కడ ఉపయోగించలేదు. కొంతకాలానికి క్రిమినల్ కి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ లో కీరవాణి తెలుసా మనసా ట్యూన్ ని వినిపించారు మహేష్ దాన్ని వెంటనే ఒప్పుకున్నారు ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ పాటని పాడారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!