Advertisement
శ్రీశైల భ్రమరాంబికా దేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందని వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికా దేవి ఆలయ ప్రధాన అర్చకులు మారండియా శాస్త్రి వేద పండితులు గంటి రాధాకృష్ణశర్మ చెప్పారు. పాఠశాలలో తయారు చేసే రోజు ప్రసాదాలు నియమని నిష్ఠలతో సుచి శుభ్రతతో ప్రధాన అర్చకులు పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పాఠశాలలో పులిహార ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదని అన్నారు. ఈ ఘటన ఎంతో మనోవేదనకి గురి చేసిందని ఆయన అన్నారు. దీనిపై పలు అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు.
Advertisement
Advertisement
శ్రీశైల క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలను కించపరిచేందుకు ఇటువంటి వార్తలు వస్తున్నాయని గంటి రాధాకృష్ణశర్మ చెప్పారు. ఇటువంటి ఘటనల పై భక్తులు సమన్వయం తో వ్యవహరించాలని అన్నారు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్ కనిపించిన గుర్తు తెలియని వస్తువులని ఎముకలుగా భావించి భక్తుడు ఫిర్యాదు చేశారని అన్నారు. రోజువారీగా ప్రసాదాల తయారీలో తయారీని ప్రధాన అర్చకులు పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు.
భక్తుడు దాల్చిన చెక్క ముక్కల్ని చూసి ఎముకలుగా భావించారని ఆలయ కమిటీ విచారణలో ఆయన మాటలు అబద్ధమని తేలిందని ఆలయ ప్రధాన అర్చకులు అన్నారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదాలు తయారీలో ఎప్పుడూ ప్రామాణికమైన నిర్వహణ విధానాలు పాటించడం వలన ఎటువంటి అపవిత్ర చర్యలకి ఆస్కారం ఉండదని చెప్పారు. ఈ పుణ్యక్షేత్రం పవిత్రతని కాపాడడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని అన్నారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహణని విశ్వసించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ఈవో పెద్దిరాజు విజ్ఞప్తి చేయడం జరిగింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!