Advertisement
రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలని మరింత ముమ్మరం చేసింది. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు టిడిపి జనసేన కూటమిలో బిజెపిని చేర్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అటు జనసేన కూడా ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు. బిజెపితో మిత్రుత్వాన్ని కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఉమ్మడిగా వైఎస్ఆర్సిపిని ఎదుర్కోబోతున్నారు.
Advertisement
బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా టిడిపి జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధం అని చెప్పారు బహిరంగంగానే ఆమె పొత్తు గురించి చెప్పారు. పొత్తు ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని కలిశారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీతో సీట్ల పంపకాలు వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తెరదించారని సమాచారం జనసేన బిజెపితో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం ఫిక్స్ అయిపోయింది. ఈనెల 21వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
వీలైతే చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో కలిసి ఉమ్మడిగా విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మహాకూటమి గురించి చెప్పబోతున్నారు. ఈ పొత్తులో భాగంగా బిజెపి జనసేనకి కలిసి 30 అసెంబ్లీ పది లోక్సభ స్థానాలని కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. 30 అసెంబ్లీ పది లోక్సభ స్థానాలని పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ కంటే కూడా బిజెపి అధికారం గా లోక్సభ స్థానాలని కోరుకుంటోంది. పది లోక్సభ నియోజకవర్గాల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. పురందేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేయడం దాదాపు ఫిక్స్ అయింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!