Advertisement
షర్మిల కొడుకు వైయస్ రాజా రెడ్డి పెళ్లి జరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి సందడి షురూ అయినా విషయం తెలిసిందే. ఆమె కొడుకు వైఎస్ రాజా రెడ్డి పెళ్లి శనివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగిన రాజారెడ్డి ప్రియా పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా హాజరయ్యారు. నూతన దంపతుల్ని వైయస్ షర్మిల బ్రదర్ అనిల్ దంపతులు, ప్రియా అట్లూరి తల్లిదండ్రులు వైయస్ విజయమ్మ ఆశీర్వదించారు. అతి కొద్ది మంది బంధువుల సమక్షం లో ఈ పెళ్లి జరిగింది. జగన్ మాత్రం వీళ్ళ పెళ్లికి వెళ్ల లేక పోయారు. వైయస్ జగన్ కానీ భారతి కానీ పెళ్లి వేడుకల్లో కనపడలేదు. కేవలం విజయమ్మ మాత్రమే వెళ్లారు.
Advertisement
Advertisement
గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ ని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమం లోనే పెళ్లికి వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రాజారెడ్డి ప్రియా నిశ్చితార్థం జనవరి 18న గండిపేటలో గోల్కొండ రిసార్ట్ లో జరిగింది. ఆ వివాహ నిశ్చితానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి వాళ్ళని ఆశీర్వదించారు. వైఎస్ జగన్ కూడా వెళ్లారు.
కానీ ఎక్కువసేపు అయన అక్కడ ఉండలేదు. గత నాలుగేళ్లుగా రాజా రెడ్డి ప్రియా ప్రేమ లో ఉన్నారు. వీళ్ళ ప్రేమ గురించి ఈ మధ్య ఇరు కుటుంబాలకి తెలిసింది. షర్మిల అనిల్ దంపతులు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. షర్మిల కొడుకు రాజారెడ్డి అమెరికా లోని డల్లాస్ యూనివర్సిటీ లో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ని పూర్తి చేశాడు. యూనివర్సిటీ నుండి ఇప్పటికే పట్టాని అందుకున్నాడు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి షర్మిల కూడా ఇక్కడ నుండి వెళ్లారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!