Advertisement
రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్ అందరికీ సుపరిచితమే అటు తమిళ్లో ఇటు తెలుగులో కూడా అదిరిపోయే హిట్లతో రజనీకాంత్ పాపులర్ అయిపోయారు. కండక్టర్గా మొదలైన ఆయన ప్రయాణం ప్రస్తుతానికి సౌత్ ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న నెంబర్ వన్ హీరోగా నిలిచారు 70 ఏళ్ల వయసు వచ్చినా కూడా కుర్ర హీరోలకి ఏ మాత్రం తీసిపోట్లేదు. ఆధ్యాత్మిక చింతన సినిమాలు పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రజినీకాంత్ కి ఇద్దరు కూతుర్లు. ఐశ్వర్య, సౌందర్య. ఇద్దరూ కూడా తమ పర్సనల్ లైఫ్ లో కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
Advertisement
సౌందర్య పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఆమెకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఐశ్వర్య కి హీరో ధనుష్ తో పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కెరియర్ పరంగా ఇద్దరూ కూడా ఇండస్ట్రీకి దర్శకులుగా ఎంట్రీ ఇచ్చారు. ధనుష్ భార్య అయిన ఐశ్వర్య డైరెక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని కొనసాగిస్తున్నారు తన తండ్రి నమ్మకాన్ని సంపాదించుకుని లాల్ సలాం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా కంటే ముందు ఆమె మరో మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు.
Advertisement
తన భర్త ధనుష్ శృతిహాసన్ మెయిన్ లీడ్ గా పెట్టి త్రీ సినిమా తీశారు తర్వాత మరో రెండు సినిమాలు తీశారు. చివరగా ఆమె ఇప్పుడు లాల్ సలాం తీశారు. కానీ అది పరాజయాన్ని ఎదుర్కొంది. ఇంకో కూతురు సౌందర్య మొదటి నుండి గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్నారు ఆమె డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా మారి సినిమా కెరియర్ లో కొనసాగిస్తున్నారు తండ్రిని హీరోగా పెట్టి ఒక యానిమేటెడ్ సినిమా తీశారు కానీ ఇది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇద్దరు కూతుర్లని నమ్మి సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. కానీ సక్సెస్ ని మాత్రం అందుకోవట్లేదు ఏది ఏమైనా వీటినే పాఠాలుగా మార్చుకుని రాబోయే రోజుల్లో ఇంకాస్త జాగ్రత్త పడి సక్సెస్ ని అందుకోవాలని కోరుకుందాం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!