Advertisement
నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలకృష్ణ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణ చాలా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ కూడా చేశారు. సింహ, లెజెండ్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో బాలయ్య డ్యూయల్ రోల్స్ చేశారు. అలా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.. 1986లో వచ్చిన అపూర్వ సోదరులు సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలో నటించారు. అంతేకాకుండా రాముడు భీముడు సినిమాలో కూడా బాలకృష్ణ రాముడిగా, భీముడుగా రెండు పాత్రలు కూడా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి కొడుకులు పాత్రలు పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు.
Advertisement
అంతేకాకుండా బాలయ్య కృష్ణ కుమార్ గా శ్రీకృష్ణదేవరాయలుగా ఆదిత్య 369 సినిమాలో ద్విపాత్రాభినయం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. బాలయ్య ఆదిత్య 369 సినిమా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా అలానే కొంచెం నెగిటివ్ పాత్ర లో ఉన్న పాత్రలో కనపడ్డారు.
Advertisement
బాలకృష్ణ హీరోగా వచ్చిన అల్లరి ప్రియుడు సినిమాలో కూడా ద్విపత్రాభినయం చేశారు. సింహలో కూడా తండ్రిగా కొడుకుగా బాలయ్య రెండు పాత్రలు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాయే కాకుండా పెద్దన్నయ్య సినిమాలో కూడా అన్నయ్యగా, తమ్ముడు గా బాలకృష్ణ కనబడి ఆకట్టుకున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన లెజెండ్ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రలు పోషించారు. అందరిని ఆకట్టుకున్నారు.
సింహా లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన మూడవ సినిమా అయిన అఖండ సినిమా లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు ఇలా ఇన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు బాలయ్య. బాలయ్య ఇప్పుడు కూడా అదే జోష్తో సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ కుర్ర హీరోలకి ఏమాత్రం తీసి పోవట్లేదు. వాళ్లకి గట్టి పోటీ ని ఇస్తున్నారు అని చెప్పొచ్చు. మరి రానున్న సినిమాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తారో లేదో చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!