Advertisement
కొన్ని పదాలు మనకి ఒకే అర్థాన్ని ఇస్తాయని, మనం వాడుతూ ఉంటాము. కానీ వాటి అర్థాలు వేరువేరుగా ఉండొచ్చు. ఉదాహరణకి లాయర్ అడ్వకేట్ రెండూ కూడా ఒకే పదాలు అని భావించి మనం వాడుతూ ఉంటాము. కాని నిజానికి లాయర్ కి అడ్వకేట్ కి చాలా తేడా ఉంది లాయర్ అడ్వకేట్ ఇద్దరూ ఒకరే అనుకుంటే కచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్లే కొన్ని పదాలు ఒకేలా వాడడం అలవాటైపోయి అలా వాడేస్తూ ఉన్నాం కానీ అర్ధాలైతే వేరు వస్తాయి ఈరోజు లాయర్ కి అడ్వకేట్ కి ఉన్న తేడా అని చూద్దాం. లాయర్ కి అడ్వకేట్ కి చాలా తేడా ఉంది. బై జ్యూస్ ప్రకారం వాటి అర్థాలని తెలుసుకుందాం.
Advertisement
లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా డిగ్రీని అందుకున్న వాళ్ళని లాయర్ అని పిలుస్తాము. భారత దేశంలో ఒక లాయర్ లేదా లా గ్రాడ్యుయేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వాళ్లు స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయాలి. అలానే ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ ని కూడా కంప్లీట్ చేయాలి తర్వాత వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎల్బీ డిగ్రీ ఉండి బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళని అడ్వకేట్ అని పిలుస్తారు. లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. వీళ్ళు కేవలం లా గురించి చెప్పగలుగుతారు కానీ వాళ్ళు కోర్టులో ఒక క్లైంట్ తరఫున వాదించడానికి ఎవ్వడు. కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లైంట్ తరఫున వాదించగలరు.
Advertisement
కేసును బట్టి తన క్లైంట్ కి నష్టపరిహారం ఇప్పించడం వంటివి చేయగలుగుతారు. అడ్వకేట్ అప్పుడే లా స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అవ్వడం వలన అడ్వకేట్ తో పోలిస్తే ఒక లాయర్ కి అనుభవం తక్కువ ఉంటుంది. న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరఫున వాదించడానికి అనుభవం అవసరం చేసి ఉంటారు అలానే ఎన్నో కేసులు వాదించడం వలన అడ్వకేట్ కి అనుభవం ఉంటుంది. లాయర్ కోర్టులో కేసును వాదించడానికి అవ్వదు.
లాయర్ కి అనుభవం తక్కువ ఉంటుంది అందుకనే అడ్వకేట్ తో పోలిస్తే లాయర్ ఛార్జ్ చేసే ఫీజ్ తక్కువ ఉంటుంది. అనుభవం ఎక్కువ ఉండడం వలన ఏ రకమైన విషయంలో అయినా వాదించే అంత పట్టు ఉండడం వలన అడ్వకేట్లు లాయర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఇంగ్లాండ్ లో సౌత్ ఆఫ్రికా, స్కాట్ ల్యాండ్ లో లా పూర్తి చేస్తే, వాళ్ళని బారిష్టర్ అని అంటారు. బారిష్టర్ కూడా అడ్వకేట్ తో సమానం కేవలం పేర్లు తేడా అంతే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!