Advertisement
నటుడు తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. తనికెళ్ల భరణి చాలా సినిమాలో నటించారు. పైగా ఆయన మంచి రచయిత కూడా. తనికెళ్ల భరణి జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరికీ తెలియదు. తన జీవితంలో జరిగిన ఏకైక అతిపెద్ద విషాదం గురించి తనికెళ్ల భరణి చెప్పారు ఆ విషయం నుండి తలుచుకుంటూ చాలా రోజులు కోల్కోలేదట తనికెళ్ల భరణి. ఇక అసలు ఏమైంది అనే విషయానికి వచ్చేద్దాం… తనికెళ్ల భరణి నటుడుగా రచయితగా దర్శకుడుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. వెండితెరపై ఎన్నో పాత్రలకి ప్రాణం పోశారు తనికెళ్ల భరణి.
Advertisement
ఎన్నో రచనలతో సాహిత్యానికి జీవం పోసారు ఒక ఇంటర్వ్యూలో సినిమా కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటుగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలని కూడా పంచుకున్నారు తనికెళ్ల భరణి. ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పేరుతో వచ్చిన అవార్డు ఎంతో ఇష్టమని తనికెళ్ల భరణి అన్నారు తన జీవితం అంతా సాఫీగా సాగిపోలేదని కష్టాలు కూడా చూసానని అన్నారు. తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన విషయాన్ని తనికెళ్ల భరణి చెప్పారు.
Advertisement
నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది అది నా స్నేహితుడు మరణం అని అన్నారు. 50 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉంది అని అన్నారు. నా మిత్రుడు దేవరకొండ నరసింహ కుమార్, నేను డిగ్రీ వరకు కలిసే చదువుకున్నంత తనకి నాకంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది. ఎంతో మంచి వాడు తెలివైనవాడు కానీ అటువంటి వాడికి ప్రమాదం జరగడం, వాడు మరణించడం జరిగింది ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు తనికెళ్ల భరణి. అలానే ఆయన నాలో ఉన్న రచయితని ముందుగా గ్రహించాడని తన ప్రోత్సాహంతోనే రాస్తూ ఉండేవాడినని.. నేను రాసింది చదివి చాలా బాగుందని చెప్పేవాడని నన్ను ప్రోత్సహించేవాడని చెప్పుకొచ్చారు నేను బాగా రాయగలను అనే నమ్మకాన్ని నాకు కలిగించింది అతనని చెప్తూ ఎమోషనల్ అయ్యారు తనికెళ్ల భరణి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!