Advertisement
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్ లలో భాగంగా బజ్ బాల్ అనేది వినపడుతోంది. దూకుడైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరుని వివరిస్తూ ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడడమే బాజ్ బాల్ కి అర్థం. ఇంగ్లాండ్ టెస్ట్ టీం హెడ్ కోచ్ ముద్దు పేరు బజ్ నుండి ఈ పదం వచ్చింది. అయితే మొదట్లో ఈ పదాన్ని ఉపయోగించడాన్ని ఇంగ్లాండ్ టీం తో పాటుగా కోచ్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది తమను కించపరిచేలా ఉందని అన్నారు కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లే బజ్ బాల్ అప్రోచ్ అని గర్వంగా మాట్లాడుకుంటున్నారు.
Advertisement
ఇంగ్లాండ్ తమ బజ్ బాల అప్రోచ్ ని చూసి ఇతర జట్లు నేర్చుకుంటున్నారని కామెంట్స్ చేశారు ఇక ఈ బజ్ బాల పేరు ఎలా వచ్చిందనే విషయానికి వచ్చేస్తే.. ఈఎస్పిఎన్ క్రికెట్ ఇన్ఫో యూకే ఎడిటర్ అందరూ మిల్లర్ మొదటిసారి ఈ పదాన్ని వాడారు ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ టెస్ట్ బ్యాటింగ్ అప్రోచ్ ను వివరిస్తూ ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. హెడ్ కోచ్ ముద్దు పేరు బజ్ నుండి ఈ పదం వచ్చింది ఆరంభంలో మెక్ తో పాటుగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ పదాన్ని ఉపయోగించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెక్ అయితే ఈ పదానికి అర్థం ఏంటో తనకి తెలియదని అర్థం లేకుండా వాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Advertisement
టెస్ట్ క్రికెట్ అంటే చాలా నెమ్మదిగా సాగే ఫార్మేట్ పరిస్థితికి తగ్గట్టుగా ఆడాలి అయితే ఈ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఎవరు అనేది పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడమే ఈ బజ్‌బాల్ అనే విధానం. 2019 నుండి 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇంగ్లాండ్ దారుణంగా విఫలమైంది ఆసీస్ సిరీస్ తో పాటుగా భారత చేతులో కూడా ఓడిపోయింది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ జట్టు ని ప్రక్షాళన చేసింది. టీం లో కోచ్ లో మార్పు చేసారు. మళ్ళీ దూకుడుగా ఆడుతున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!