Advertisement
యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షణ్ముఖ్ తో పాటుగా అతని అన్నయ్య సంపత్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. షన్ను గంజాయి సేవించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన తరపు లాయర్ దిలీప్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు మౌనిక అనే యువతి ఫిర్యాదు మేరకు షన్ను అన్నయ్య సంపత్ కోసం పోలీసులు నివాసానికి వెళ్లారు. అక్కడ షణ్ణు గంజాయి మత్తులో ఉన్నాడని గదిలో గంజాయి కూడా లభ్యమయిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం షన్ను బయటకి వచ్చేసాడు కానీ పోలీసులు షన్ను ని అతని బ్రదర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు విచారణ ముగిస్తే కానీ నిజానిజాలు తెలియవు.
Advertisement
దిలీప్ సుంకర మాట్లాడుతూ మౌనిక సంపత్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లికూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇరు కుటుంబాలు పెద్దలు ఒప్పుకున్నారు. పెళ్లి కోసం మౌనికకి 40 లక్షలు ఖర్చు చేశారు. దానికి ఆధారాలు ఉన్నాయి కొద్దిరోజుల్లో పెళ్లి అనగా ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయి దాంతో సమస్య మొదలైంది అమ్మాయి కేసు పెట్టింది కానీ ఆమెతో పేరెంట్స్ రాలేదు అని చెప్పారు. మౌనిక ఫిర్యాదు మేరకు సంపత్ కోసం వచ్చిన పోలీసులు ఆయన లేకపోవడంతో షన్ను వుండే రూమ్ కి వచ్చారు. అది షన్ను వర్క్ ప్లేస్ అలానే అందరూ వచ్చే రూమ్ కూడా.
Advertisement
చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు గదిలో దొరికిన గంజాయి ఎవరిది అనేది పోలీసులు విచారించాల్సి ఉంది. పోలీసులు వచ్చేనాటికి షన్ను ఏ కండిషన్లో ఉన్నాడనేది తెలియదు దీనికి సంబంధించిన వీడియో ఉంది. సంపత్ కేసును లోతుగా విచారించి ఎందుకు షన్ను ని ప్రశ్నలు అడగ్గా సహకరించలేదని అంటున్నారు. షన్ను ఇంటికి మధ్యకాలంలో ఎవరో వచ్చారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకోవాలి. షన్ను మీద వచ్చినవి ఆరోపణలు మాత్రమే. విచారణలో నిజాలు తేలుతాయి అని దిలీప్ సుంకర క్లారిటీ ఇచ్చారు. దిలీప్ సుంకర గత నాలుగేళ్ల నుండి షన్ను దగ్గర లీగల్ అడ్వైజర్ గా పని చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!