Advertisement
హిందువులు మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి నాడు శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. భక్తి శ్రద్ధతో భగవంతుని ఆరాధిస్తారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు కలలోకి మనకి వస్తూ ఉంటాయి. వాటిని సరిగా అర్థం చేసుకుంటే ముందు ముందు వచ్చే ప్రమాదాలను దూరం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని కలలు మంచి ఫలితాన్ని తీసుకొస్తే కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందట. శివరాత్రి సందర్భంగా కలలు శివుడు ముందస్తు సలహా ఇస్తాడని అంటున్నారు.
Advertisement
హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో కృష్ణ పక్షం 14వ రోజున మహా శివరాత్రిని జరుపుకుంటాము ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. ఈ తేదీన రుద్రాభిషేకం చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది శివరాత్రి నాడు ఉపవాసాలు, పూజలు, జాగరణ, శివనామ ధ్యానం చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది మన కోరికలు నెరవేరుతాయి. మహా శివరాత్రికి ముందు వచ్చే కొన్ని కలలు శుభ సంఘటనని సూచిస్తాయట. ఈ కలలు మీకు శివుని ఆశీస్సులు ఉన్నాయని చెప్తాయి. మహా శివరాత్రికి ముందు కలలు ఆనందాన్ని ఇస్తాయి మహాశివరాత్రికి ముందు కలలో శివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా కల వచ్చిందంటే కష్టాలన్నీ కూడా త్వరగా వెళ్ళిపోతాయని అర్థం. ఆనందంగా ఉండొచ్చు.
Advertisement
శివరాత్రికి ముందు కలలో బిల్వ ఆకులు. బిల్వ చెట్లు కనపడితే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఆర్థిక సమస్యలు ఏమి లేకుండా సంతోషంగా ఉండొచ్చట. మహాశివరాత్రికి ముందు కలలో రుద్రాక్ష కనుక కనపడిందంటే వ్యాధులు బాధలు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని ఇది సూచిస్తుంది శివరాత్రి ముందు నల్లని శివలింగం కలలో కనపడితే త్వరలో ప్రమోషన్ రాబోతోందని అర్థం. మహాశివరాత్రి ముందు పాము లేదా పాము గూళ్ళు కలలో చూస్తే సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. శివుని వాహనమైన నంది లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణం. శివరాత్రికి ముందు కలలో నంది కనపడితే శివుని అనుగ్రహం లభించిందని అర్థం చేసుకోవాలి అలానే కలలో త్రిశూలం కనబడితే కూడా మంచిదే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!