Advertisement
ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ గురించి పరిచయం చేయక్కర్లేదు. రోహిత్ శర్మ భారత టి20 వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక మూడు ఫార్మాట్లు తొలి సిరీస్ లలోనే ప్రత్యర్థి షాట్ ని క్లీన్ స్వీప్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. 2023 ఫిబ్రవరిలో నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా టెస్ట్ వన్డే టీ20 ఇలా మూడు ఫార్మేట్ లలో కూడా సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా నిలిచాడు రోహిత్. ఇక పర్సనల్ లైఫ్ కి సంబంధించి చూస్తే రితిక్ ని రోహిత్ పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే.
Advertisement
Advertisement
రోహిత్ శర్మ ఎంత కూల్ గా ప్రతిదీ కూడా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని తీసుకునే స్వభావం కలవాడు ఇక రితిక అయితే కచ్చితంగా అనుకున్నది జరగాలని మనస్తత్వం కలవారు ఇద్దరికీ కూడా కుటుంబం పై గౌరవం ప్రేమ ఎక్కువ రోహిత్ శర్మ ఇంటర్ తో పోతన చదువుకి ఫుల్స్టాప్ పెట్టేసారు రితిక మాత్రం డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత ఈమె ఒక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేశారు. ఈ సంస్థ ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్స్ అన్నింటికీ ప్రమోషన్స్ చేస్తూ ఉండేది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వీళ్ళ క్లైంట్. రితిక కి యువరాజ్ తో పరిచయం అయ్యింది.
తరచుగా యువరాజ్ వీళ్ళ కంపెనీ మీటింగ్లకి కూడా వచ్చేవారు. ఇలా యువరాజ్ బాండింగ్ మొదలైంది. సొంత అన్నయ్యగా భావించింది రితిక యువరాజ్ కి రాఖీ కూడా కట్టారట ఇలా బాండింగ్ స్టార్ట్ అయింది. ఒకసారి అడ్వర్టైజ్మెంట్ షూట్ చేయాల్సిన బాధ్యత రితిక మీద పడింది. రితిక రోహిత్ శర్మని పెట్టి యాడ్ చేయాల్సి వచ్చిందట రోహిత్ ని తీసుకుని యువరాజ్ సింగ్ ఆఫీస్ కి వెళ్ళారు. రితికని అప్పుడే రోహిత్ శర్మ కి పరిచయం చేశారు. ఇలా వీళ్ళ మధ్య నెమ్మదిగా ప్రేమ మొదలైంది. 2015లో వీళ్ళిద్దరూ కూడా ఒకటయ్యారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసమా ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!