Advertisement
ప్రతిరోజు ఆహారాన్ని స్కిప్ చేయకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు. ఉదయం పూట చాలామంది బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ అనగానే మొట్టమొదట మనకి గుర్తొచ్చేది ఇడ్లీ చాలామంది రెగ్యులర్ గా ఇడ్లీ ని తింటూ ఉంటారు. ప్రతిరోజు చాలామంది అల్పాహారం కింద ఇడ్లిని తీసుకుంటూ వాళ్ళ రోజుని ఇడ్లీతో మొదలు పెడుతూ ఉంటారు. వేడివేడి ఇడ్లీ ని చట్నీ లేదంటే సాంబార్ తో తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ మంది ఇడ్లీలు తింటూ ఉంటారు.
Advertisement
ఈ మధ్యకాలంలో చాలామంది మినపతో కాకుండా తృణధాన్యాలతో ఇడ్లీలు చేసుకుంటున్నారు. రాగి ఇడ్లీ ఇలా రకరకాలు ఇడ్లీలు కూడా తయారు చేసుకుంటున్నారు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే 150 యొక్క వంటకాలు మీద కొంతమంది పరిశోధకులు పరిశోధన చేశారు. అయితే ఈ పరిశోధనలో కొన్ని భారతీయ వంటకాల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా శాఖాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిద్యం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలింది.
Advertisement
మన వంటకాలు ఎక్కువగా బియ్యం పప్పు ధాన్యాలని వాడుతూ ఉంటాము. ఇక్కడ చాలామంది శాకాహారులు ఉన్నారు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏమీ రావు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు పరోటా, దోస, బోండా వంటివి జీవవైవిద్యానికి తక్కువ ముప్పు తెస్తాయని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలు మీద నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు చేశారు. బ్రెజిల్ దేశాలలో పశువుల మాంసం, స్పెయిన్ దేశానికి చెందిన రోస్ట్ లాంబ్ అలానే బ్రెజిల్ దేశానికి చెందిన లచావో వంటి ఆహార పదార్థాలు జీవవైవిద్యానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. రెగ్యులర్ గా మనం తినే ఇడ్లీ వంటి వాటి వలన పెద్దగా నష్టం ఏమీ వాటిల్లదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!