Advertisement
చాలామంది అవకాశాల కోసం ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు కానీ అందరూ అనుకున్నంత సక్సెస్ కాలేరు. మధ్యలోనే ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోవడం లేదంటే మరో దారిని వెతుక్కోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి కమెడియన్లుగా వచ్చి హీరోలుగా మారి కెరీయర్ని పాడు చేసుకున్న కమెడియన్లు కూడా ఉన్నారు. మరి అలా టాలీవుడ్ లో
ఫేడ్ అవుట్ అయిపోయిన కమెడియన్ ల గురించి ఇప్పుడు చూద్దాం. కమెడియన్లు గా మంచి సక్సెస్ ని అందుకొని తర్వాత హీరోగా ట్రై చేసి కెరీర్ ని పాడు చేసుకున్న వాళ్లు మన టాలీవుడ్ లో ఉన్నారు. అలా కాకుండా చక్కగా వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ కమెడియన్ గా దూసుకు వెళ్లిపోయి ఉంటే ఓ రేంజ్ లో ఉండేవారు ఇప్పుడు.
Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి తర్వాత కమెడియన్ గా సెటిల్ అయ్యారు. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన యమలీల సినిమాతో ఆలీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా పది సినిమాల వరకు హీరోగా చేసాడు. అందులో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా మిగిలినవన్నీ కూడా అసలు ఉపయోగపడలేదు. దాంతో హీరోగా కెరియర్ లేకపోవడంతో మళ్లీ కమీడియన్ గా వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.
Advertisement
అలానే వేణుమాధవ్ కూడా కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేణుమాధవ్ హీరోగా మారి హంగామా, ప్రేమాభిషేకం, భూకైలాస్ వంటి సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. దాంతో మళ్ళీ కమెడియన్ గా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అనారోగ్యం కారణం చేత కొన్ని సంవత్సరాలు క్రితం ఆయన చనిపోయిన విషయం తెలిసిందే. ఇక కమెడియన్ సునీల్ కూడా హీరోగా మారి కెరీర్ ని కాస్త ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, చిరునవ్వుతో వంటి సినిమాల్లో కమెడియన్ గా మెప్పించారు సునీల్.
తర్వాత బిజీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక సందర్భంలో సునీల్ కి తినడానికి కూడా టైం లేనంత బిజీగా షూటింగ్స్ ఉండేవట. అలాంటిది అందాల రాముడు సినిమాతో హీరోగా మరి తర్వాత పలు సినిమాలు చేసి హీరో గానే అవకాశాల కోసం ట్రై చేసి కమెడియన్ రొలెస్ చేయడం మానేశారు. కొన్నాళ్ళకి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!