Advertisement
Operation Valentine: తెలుగు, యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లో వరుణ్ తేజ్,మానుషి చిల్లర్,నవదీప్,రుహానీ శర్మ నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఫిదా, తొలిప్రేమ మూవీస్ తరవాత మళ్లీ వరుణ్ తేజ్ హిట్టు కొట్టలేదు. వరుణ్ నటించిన గని, గాండివధారి అర్జున సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అయినా సరే ప్రయోగాలు చేస్తూనే వున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు వరుణ్. ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. పుల్వామా దాడుల నేపథ్యంతో ఈ మూవీ కథ వుంది.
Advertisement
సినిమా: ఆపరేషన్ వాలెంటైన్
నటులు: వరుణ్ తేజ్,మానుషి చిల్లర్,నవదీప్,రుహానీ శర్మ
దర్శకుడు: శక్తి ప్రతాప్ సింగ్
సినిమా శైలి: తెలుగు, యాక్షన్
వ్యవధి:2 Hrs 13 Min
కథ మరియు వివరణ:
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వజ్ర అనే ఓ మిషన్‌ను టెస్ట్ చేస్తుంటుంది. 20 మీ. ఎత్తు లో జెట్‌ను నడిపితే రాడార్‌కు చిక్కకుండా ఉండే కాన్సెప్ట్ అవ్వడం తో వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) పరీక్షించాలనుకుంటాడు. ఆ పరీక్ష విఫలం కావడం తో జరిగిన ప్రమాదంలో కబీర్ (నవదీప్) చనిపోతాడు. దీంతో ఆ టెస్ట్‌ను, వజ్ర మిషన్ ని పక్కన పెట్టేస్తుంది. మరో వింగ్ కమాండర్ ఆహ్నా గిల్ (మానుషి చిల్లర్). తరువాత కొన్నేళ్లకు అర్జున్ దేవ్ కోలుకుంటాడు. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ దాడి చేస్తుంది. పుల్వామా ఎటాక్ లో వీర సైనికులు మరణిస్తారు. ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసొస్తుంది. ఆ తరువాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ఏంటి…? వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా అడ్డుకుంది..? నెహ్రూ అనే కోడ్ తో పాకిస్థాన్ చేయదల్చుకున్న దాడి ఏంటి…? వీటిని వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ ఎలా తిప్పి కొట్టాడు…? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
Advertisement
ఈ సినిమాలో పుల్వామా ఎటాక్ దాడిలో మన సైనికులు చనిపోయిన ఘటన చూపించారు. ఎమోషన్ ఇందులో కనిపించదు. బాగా ఎమోషనల్ గా ఉండాలి. ఇది సినిమా కి పెద్ద మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదేదో జరిగిపోతోన్నట్టుగా తీసేసారు. అంతా సెకండాఫ్ కోసం సెటప్లానే వుంది. కొన్ని సార్లు ఆ పదాలు అర్థం కావు. ఎమోషనల్ గా ఆడియెన్స్ ని కనెక్ట్ చేసుంటే ఓ రేంజ్ లో హిట్ అయ్యేది. విజువల్స్ బాగున్నాయి. అలానే నిర్మాణ విలువలు కూడా బావున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
సెకండ్ హాఫ్
విజువల్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వని సీన్స్
మాటలు
ఫస్ట్ హాఫ్
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!