Advertisement
చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన అంతా మంచే జరుగుతుంది. పండితులు కూడా వాస్తు ప్రకారం ఎలా అనుసరించాలని చెప్తూ ఉంటారు. వంటగదిలో లక్ష్మీదేవితో పాటుగా అన్నపూర్ణ కూడా కొలువై ఉంటుంది అందుకని ఇల్లు మాత్రమే కాదు వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శివుడికి అన్నం పెట్టిన లోకమాత అన్నపూర్ణాదేవి. కనుక అన్నానికి కూడా మనం విలువనివ్వాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పారేయకూడదు. వంటగదిపై ప్రత్యేక శ్రద్ధని పెట్టడం కూడా చాలా అవసరం. ఆరోగ్యం కూడా వంటగది మీద ఆధారపడి ఉంటుంది. ఆహార పదార్థాలని నిల్వ ఉంచుకోవాలి ఇక్కడే. మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వంటగది బాగుండాలి అని చాలామంది మహిళలు తమ అభిరుచిని ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు.
Advertisement
Advertisement
అందుకోసం రంగు రంగులు పెయింట్లు కూడా వేయించుకుంటూ ఉంటారు రకరకాల కిచెన్ టైల్స్ ని కూడా వేయించుకుంటూ ఉంటారు. బ్లాక్ గోధుమ రంగు రంగులని వంటింట్లో వేయించుకోకూడదు లెమన్ ఎల్లో లేదా లైట్ గ్రీన్ వంటి వాటిని వేయించుకోవచ్చు ఎప్పుడు కూడా టాయిలెట్ మీద వంటగదిని కట్టుకోకూడదు. వంట గదిలో స్పూన్లు చాకులు కత్తులు మీకు ఎదురుగా పెట్టుకోకూడదు.
చాలామంది కిచెన్ లో వస్తువులని ఎక్కడపడితే అక్కడ సర్దుతూ ఉంటారు అలా కాకుండా పాత్రలని పడమర లేదా సౌత్ వెస్ట్ లో పెట్టుకోండి. వంట గదిలో ముఖ్యమైన వస్తువులు ఫ్రిడ్జ్ మిక్సీ మైక్రోవేవ్ లని నార్త్ వెస్ట్ లో పెట్టుకోండి. కిచెన్ లోపల నార్త్ వెస్ట్ జోన్ లో ఫ్రిడ్జ్ ఉంచవచ్చు ఇలా ఈ టిప్స్ ని పాటిస్తే వాస్తు ప్రకారం ఏ ఇబ్బందులు కలగవు చక్కటి పాజిటివ్ కూడా వస్తుంది. మరి చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని. వీటిని కనుక అనుసరించారంటే అంతా మంచి జరుగుతుంది ఏ సమస్యలు ఉండవు చక్కటి పాజిటివ్ ఎనర్జీ ని ఇంట్లోకి తీసుకు రావచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!