Advertisement
మురుగుడు లావణ్య ఎవరు..? మంగళగిరిలో నారా లోకేష్ పై మురుగుడు లావణ్య పోటీ చేస్తోందని జగన్ సర్కార్ ప్రకటించింది. అసలు ఈమె ఎవరు..? లోకేష్ పై పోటీ చేస్తున్న ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జగన్ ఎందుకు ఈమెని బరిలోకి దించారు..? ఈమె గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు అసలు ఈమె గురించి పూర్తిగా వివరాలు చూసేద్దాం.. చంద్రబాబు నాయుడు మంగళగిరిలో టిడిపి జనసేన కూటమి నుండి పోటీ చేయడానికి నారా లోకేష్ ని ఎంపిక చేశారు అయితే ఇక్కడ నారా లోకేష్ తో బరిలోకి మురుగుడు లావణ్య ని వైసీపీ ప్రభుత్వం దింపుతోంది. 1999లో కాంగ్రెస్ తరపు నుండి మురుగుడు హనుమంతరావు పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో కూడా మరోసారి బరిలోకి దిగి గెలుపొందారు.
Advertisement
Advertisement
ఇలా మురుగుడు హనుమంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు సేవలు చేశారు. మంగళగిరిలో కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఓడిపోతారని ఓటమి తప్పదని తెలియడంతో ఈసారి టికెట్ ఆళ్ళకు కేటాయించలేదు. కాంగ్రెస్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరిపోయారు. దీంతో వైసిపి ఇన్చార్జిగా గంజి చిరంజీవిని పెట్టారు. మళ్లీ ఆళ్ల తిరిగి వచ్చారు. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారా లేదా అనే సందేహం కలిగింది.
ఇద్దరికీ కాకుండా మరో వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మురుగుడు లావణ్య మురుగుడు హనుమంతరావు కూతురు వైసీపీ ప్రభుత్వం బర్లోకి దింపింది లోకేష్ పై ఒక మహిళను నిలబడితే ఎక్కువ ఓట్లు వస్తాయని ఇలా వైసిపి ప్రభుత్వం ప్లాన్ చేసింది. మరి మురుగుడు లావణ్య వైసీపీ నుండి గెలుస్తారా అనేది చూడాలి. ఒకసారి నారా లోకేష్ ఓడిపోయిన సానుభూతి ఉంది. ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో పని చేస్తున్నారు లోకేష్ సో ఈ విధంగా చూసుకుంటే కచ్చితంగా లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!