Advertisement
Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుకు అయితే పెద్ద షాక్ తగిలింది. అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సత్తెనపల్లి వైసీపీ నేతలు పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసారు. నియోజకవర్గం లో అంబటిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే పరిస్థితి లేదని స్థానిక నేతలు అయితే అంటున్నారు. పైగా అంబటి వ్యవహారశైలి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రిని వేరే నియోజకవర్గానికి మార్చాలని వైసీపీ నేతలు డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే అలా కాకుండా అంబటి సత్తెనపల్లి నుండే పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల తేడా తో ఓడిపోతారని అంటున్నారు.
Advertisement
ఈ విషయాన్ని నరసారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక వైసీపీ నేతలు దగ్గరకి తీసుకుని వెళ్లారు. రానున్న ఎన్నికల్లో అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా అడ్డుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ కి చెప్పారు. అంబటి రాంబాబు తీరు వలన నియోజకవర్గం లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్కు అయితే కంప్లైంట్ చేశారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని సత్తెనపల్లి వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ ని కోరారు.
Advertisement
2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి , కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి కోడెల శివప్రసాద్రావును ఓడించి జగన్ మంత్రివర్గంలో చోటు ని దక్కించుకున్నారు. ఈసారి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చెయ్యనున్నారు. సొంత పార్టీ నేతలు అంబటికి వ్యతిరేకంగా ఉండడం తో అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి ,కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్రావును ఓడించి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!