Advertisement
Non veg: మనం కొన్ని కొన్ని నియమాలని కచ్చితంగా పాటిస్తూ ఉంటాము. ముఖ్యంగా మాంసాహారం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలని కచ్చితంగా పాటిస్తూ ఉంటాము ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ తినే వాళ్ళు ఇళ్లల్లో నాన్ వెజ్ వాసన గుమగుమలాడిపోతూ ఉంటుంది. కొంతమంది అయితే మాంసం లేకపోతే అన్నం తినరు. కొంతమంది వారంలో కొన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా కొన్ని రోజులు మాత్రమే నాన్ వెజ్ ని తీసుకుంటూ ఉంటారు. ఆదివారం మాత్రం పక్కాగా చాలామంది తింటూ ఉంటారు. అయితే శనివారం మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉంటారు.
Advertisement
శనివారం మాంసాహారం తీసుకోకూడదని చాలామంది భావిస్తారు. అయితే ఎందుకు శనివారం పూట నాన్ వెజ్ తీసుకోరు…? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మాంసాహారం పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ శాకాహారంలో లేని పోషకాలు మాంసాహారంలో ఉన్నాయని సైన్స్ అంటోంది. మాంసంలో ప్రోటీన్ అలానే కొన్ని ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చికెన్ చేపల్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇవి అందిస్తాయి.
Advertisement
చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ ఇలా రకరకాల వంటకాలని మనం మాంసం తో తయారు చేసుకోవచ్చు. వీటి పేరు చెప్తేనే చాలామందికి నోరూరు పోతూ ఉంటుంది. శనివారం మాంసాహారం తినకూడదని చాలా కాలం నుండి మన పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో భూమి పై చంద్రుడు ప్రభావం వలన మన జీర్ణ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది. దీనితో జీర్ణ సమస్యలు వస్తాయి. దానితో పాటుగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి అందుకనే శనివారం చాలా మంది నాన్ వెజ్ ని తీసుకోరు. శనివారం నాడు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. అయితే ఈ ఒక కారణమే కాదు వివిధ కారణాల వలన శనివారం నాడు మాంసాహారానికి దూరంగా ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!