Advertisement
తుమ్మల నాగేశ్వరరావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. 32 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కీలకమైన పదవులు లో కొనసాగుతూ ఆ పదవులకే వన్నెతెచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆహ్వానం మేరకు ఆ పార్టీ లో చేరారు తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు అందరికీ సుపరిచితమే. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఆయన తెలుసు. అత్యంత హుందాగా ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటారు తుమ్మల. ఎన్టీఆర్ గారి టైం లో కూడా ముఖ్యపాత్ర పోషించారు.
Advertisement
Advertisement
తర్వాత కేటీఆర్ తో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవి చేపట్టారు. ఈయన చరిత్ర చాలా గొప్పదని చెప్పొచ్చు. మంచి పేరు తెచ్చుకున్న అతికొద్దిమంది రాజకీయ నాయకుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సమితి అధ్యక్ష ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా అభ్యర్థికి మద్దతు ఇచ్చి తాను మద్దతు ఇచ్చే వ్యక్తిని గెలిపించాలని ఎంతో కష్టపడి గెలిపించారు. 1963 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్నగారి ప్రభంజనంతో 22 స్థానాల్లో విజయాన్ని సాధించింది.
ఇక ఓటమిపాలైన తుమ్మల దగ్గరికి వచ్చి ఏకంగా ఎన్టీఆర్ గంట సేపు పైగా మాట్లాడారట. ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు గారి తో ఈ విధంగా అన్నగారు అన్నారు. నేను ఇతర ప్రాంతాల్లో పర్యటించడం వలన నీ నియోజక వర్గం దగ్గరికి రాలేకపోయాను అయినప్పటికీ నువ్వు కేవలం కొంత తేడాతోనే ఓడిపోయావు అని అన్నారట. నేను రాకపోవడం వలన నీకు ఓటమి ఎదురైందని అన్నారట. అలానే బాధపడ్డారట. మళ్లీ ఎన్నికల్లోకి కూడా టికెట్ ని కేటాయించారు ఎన్టీఆర్.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!