Advertisement
Kiran Abbavaram: ఫస్ట్ మూవీ తోనే దగ్గరైనా హీరో హీరోయిన్లు లైఫ్ లో ఒకటి అవ్వాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాజా వారు రాణి గారు సినిమాలో రీల్ జోడి అయిన కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ ఒకటయ్యారు. కొన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని పుకార్లు తెగ షికార్లు కొట్టాయి. కానీ ఎట్టకేలకు ఇది నిజమని తెలుస్తోంది. కిరణ్ సబ్బవరం తన స్నేహితురాలు, ప్రియురాలు అయిన రహస్య ని నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో రియల్ జోడిగా వీళ్ళు మారారు. రాజావారు రాణి గారు సినిమాలో హీరో హీరోయిన్లుగా కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ నటించారు. నిజ జీవితంలో కూడా ఇప్పుడు ఒకటవరు. వీళ్ళ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోని ఒక రిసార్ట్ లో ఘనంగా జరిగింది.
Advertisement
ఇరు కుటుంబాలు కొద్దిమంది బంధువులు స్నేహితులు సమక్షంలో బుధవారం రాత్రి ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో హీరోయిన్ల అభిమానులు నెటిజన్లు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి పెళ్లి ఆగస్టులో జరగబోతుందని సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. రాజావారు రాణి గారు సినిమాతో కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. రొమాంటిక్ డ్రామా గా పేరు పొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేసింది.
Advertisement
సినిమా షూటింగ్లోనే కిరణ్ రహస్య మధ్య స్నేహం బాగా ఏర్పడింది ఆ తర్వాత ప్రేమగా మారింది. గతంలో కిరణ్ అబ్బవరం రహస్య తన స్నేహితురాలు మాత్రమే అని చెప్పారు కొన్ని రోజులుగా మా మధ్య పెళ్లి కుదిరిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో రహస్య గురించి కిరణ్ ని అడిగితే కిరణ్ కాస్త సిగ్గుపడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని గుసగుసలు వినపడ్డాయి. ఇప్పుడు నిశ్చితార్థం కూడా అయిపోయింది. రాజా వారు రాణి గారు సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ ఇలా పలు సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా కిరణ్ కి సక్సెస్ ని తీసుకురాలేదు. కానీ సినిమా అవకాశాలు మాత్రం అలా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!