Advertisement
బుల్లితెర నటి ఐశ్వర్య అడ్డాలపై తన భర్త శ్యామ్ కుమార్ ఆరోపణలు చేసారు. మ్యాట్రిమోనీ యాప్ ద్వారా ఈ సంబంధం వచ్చిందని పెళ్లి చేసుకుందామని నెలరోజుల తర్వాత ఐశ్వర్య బండారం మొత్తం బయటపడిందని, గతంలోనే ఆమెకి పెళ్లయిందని ఇంకొకరితో అక్రమ సంబంధం ఉందని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేశాడు శ్యాం కుమార్. పైగా ఐశ్వర్య తన దగ్గర నుండి 25 లక్షలు తీసుకుందని ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకున్న కరణం రమేష్ బాబు తనని బెదిరించాడని కొన్ని ఆడియో క్లిప్పులు కూడా వినిపించాడు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త మొత్తం పాకేసింది. భర్త చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించింది ఐశ్వర్య. తను చేసిన అలగేషన్స్ నిరాధారమైనవని అబద్ధాలు అని అంది. అసలు నిజం ఏంటి..? నటి ఐశ్వర్య ఇండస్ట్రీలో కొన్ని ఏళ్లుగా నటిస్తోంది. సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది కొన్ని సీరియల్స్ చేసింది తర్వాత సీరియల్స్ ద్వారా ఫేమస్ అయింది.
Advertisement
Advertisement
శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె తనని మోసం చేసిందని మీడియాకి ఎక్కాడు శ్యామ్. అతను చెప్తున్న వివరాలను చూస్తే కాపు మ్యాట్రిమోనీలో సంబంధం వచ్చిందని సెప్టెంబర్ 6న విశాఖపట్నంలో పెళ్లి అయ్యిందట పెళ్లి అయిన 15 రోజులకే హైదరాబాద్ వెళ్లారు. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం చూసానని ఆమెకి గతంలో పెళ్లయిందని నన్ను మోసం చేస్తుందని శ్యాం చెప్పాడు. మందు స్మోకింగ్ అలవాట్లు కూడా ఉన్నాయని హైదరాబాద్ వెళ్లాక నాకు ఈ విషయం తెలిసిందని చెప్పాడు.
ఆమెతో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి నాకు ఫోన్ చేసి బెదిరించాడు. విడాకులు ఇవ్వాలని టార్చర్ చేశాడు. పెళ్లికి పెట్టిన నగలు 25 లక్షల క్యాష్ నా భార్య కాజేసింది అని పోలీసులకి కంప్లైంట్ చేశాడు. సెలూన్, ఉద్యోగం ద్వారా వస్తుందని చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను అని ఐశ్వర్య అంటోంది. ఎంగేజ్మెంట్ ముందు రెండు నెలలు వేధించాడు షూటింగ్లో ఉండగానే వీడియో కాల్ చేసి హింసించేవాడని ఐశ్వర్య చెప్తోంది. స్పా సెంటర్ అయితే మా వాళ్ళు పెళ్లి చేసే వారే కాదు. నా ఇష్ట ప్రకారం అతన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి అయిన 16 రోజుల నుండి మా మధ్య గొడవలు జరిగాయని టార్చర్ చేస్తున్నాడని ఐశ్వర్య చెప్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!