Advertisement
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాలు చెసాటున్నారు. లక్ష రూపాయలు జీతం వచ్చే జాబ్ ని వదులుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఇతను మాత్రం లక్ష రూపాయల ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. ఎవరో కాదు కృష్ణన్ మహదేవన్. బెంగళూరులో ఉంటున్నారు. ప్రముఖ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా వర్క్ చేస్తూ లక్ష రూపాయల జీతం ని పొందేవారు. లక్ష వచ్చే జాబ్ అయినా సరే వదిలిపెట్టి వచ్చేసారు. ఎన్నో ఏళ్ల నుండి తన తండ్రి నిర్వహిస్తున్న ఇడ్లీ హోటల్ ని చూసుకోవడానికి ఇలా చేశారు కృష్ణన్ మహదేవన్. ఆయన తండ్రి 2001లో బెంగళూరులో విజ్ఞాన్ నగర్ లో ఇడ్లీ హోటల్ ని ప్రారంభించారు.
Advertisement
కేవలం ఇడ్లీలు మాత్రమే అక్కడ అమ్మేవారు క్వాలిటీ అయితే అసలు చూసుకోక్కర్లేదు రుచి కూడా అద్భుతంగా ఉండేది. ఇడ్లీల ని కొబ్బరి చట్నీ తో పాటు సర్వ్ చేసేవారు వీటి టేస్ట్ అక్కడ ప్రాంత వాసులకి ఎంతగానో నచ్చేసింది. దీంతో హోటల్ కి గిరాకీ పెరిగింది కృష్ణన్ మహదేవన్ కూడా ఒకవైపు కాలేజీకి వెళ్తూ కుదిరినప్పుడల్లా హోటల్ కి వెళ్లి పని చేసేవారు తర్వాత అతను ఉద్యోగంలో చేరిపోయారు. 2009లో ఆయన తండ్రి చనిపోయారు కొంత కాలం పాటు అయ్యర్ ఇడ్లీ హోటల్ ని నిర్వహించారు.
Advertisement
కృష్ణన్ తల్లి ఉమ ఒకరి వల్లే కాలేకపోయింది దీంతో లక్షల రూపాయల జాబ్ ని వదిలేసుకుని వారసత్వంగా వస్తున్న హోటల్ ని నడపాలని నిర్ణయం తీసుకున్నారు తర్వాత అస్సలు వెనక్కి తిరిగి చూడలేదు. క్వాలిటీ రుచిని మైంటైన్ చేస్తూ ఇడ్లీ లను అమ్మడం మొదలుపెట్టారు. అప్పటినుండి కూడా హోటల్ కి పేరు మరింత వచ్చింది ఎవరు కూడా అయ్యర్ ఇడ్లీలకి పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఇడ్లీలకి స్పెషల్ గా కస్టమర్లు వచ్చేవారు కేవలం 200 చదరపు అడుగులు ఉన్న ఈ హోటల్ ద్వారా 50వేల వరకు ఇడ్లీలను నెలకి అమ్ముతుంటారు. ఇదే కాదు వడ, కేసరి బాత్, కారా బాత్ ఇటువంటి రుచికరమైన టిఫిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!