Advertisement
లంబసింగి సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్: దివి వద్యా, జై భారత్ రాజ్, వంశీ రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు లంబసింగి సినిమాలో నటించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ చేసారు. కే బుజ్జి సినిమాటోగ్రఫి అందించారు. మార్చి 4, 2024 న సినిమా రిలీజ్ చేస్తున్నారు.
Advertisement
సినిమా: లంబసింగి
నటులు: దివి వద్యా, జై భారత్ రాజ్, వంశీ రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు
దర్శకుడు: నవీన్ గాంధీ
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
సినిమాటోగ్రఫి: కే బుజ్జి
రిలీజ్ డేట్: మార్చి 15, 2024
కథ మరియు వివరణ:
ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే.. వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. లంబసింగి లో పోస్టింగ్ వస్తుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి లవ్ చేస్తాడు. ఆమె ఒక మాజీ నక్సలైట్ కూతురు అని తరవాత తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం ఇస్తుంది. దివి తండ్రి కూడా వుంటారు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి రోజూ ఆమె తండ్రి తో సంతకం పెట్టించేందుకు వెళ్తాడు. హరిత ఆ ఊరి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు. అదే మంచి సమయం అని భావించి హరితకి లవ్ గురించి చెప్పేయాలని అనుకుంటాడు.
Advertisement
ఒక రోజు హరితకి తన ప్రేమని చెప్తాడు కానీ ఆమె ఒప్పుకోదు. వీరబాబు బాధపడతాడు. ఒక రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉంటాడు. కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసికెళ్తారు. గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. అసలు హరిత తన ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసింది..? ఆమె గతం ఏంటి..? తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న కథ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. తర్వాత స్పీడ్ గా నడుస్తుంది. హీరోయిన్ ట్రాక్ ని దర్శకుడు డిజైన్ చేసిన తీరు అయితే బాగుంది.
ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ బాగుంది. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసారు. వీరబాబు, రాజు కామెడీ అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కచ్చితంగా థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తారు. ఆడియెన్స్ ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు దర్శకుడు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం మూవీ కి పెద్ద ప్లస్ అయింది. ఈ మూవీ లో దివి నటన చాలా బాగుంది. హరిత పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్లు కూడా ఉంటాయి. అలానే హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్ర లో చాలా నేచురల్ గా యాక్ట్ చేసాడు. అలానే కామెడీతో అలరించాడు.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీ నటులు
దర్శకత్వం
ట్విస్టులు
ముగింపు
కామెడీ
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా సీన్స్
Rating: 3/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!