Advertisement
Tirupati Old Photos చాలామంది ప్రతి ఏటా కూడా తిరుమల వెళ్తూ ఉంటారు తిరుమల వెళ్లి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఇలా తిరుపతి వెళ్లడం వలన భక్తుల కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. ప్రతినిత్యం తిరుమల కి భక్తులు తండోపతండాలుగా వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక నగరాల నుండి భక్తులు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల వెళ్లే భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు వరాహస్వామి వారిని దర్శించుకుంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
Advertisement
పురాణాల ప్రకారం తిరుమల వరాహస్వామి కి చెందినదట తిరుమలని శ్రీవారికి అప్పగించడానికి వరాహ స్వామి ఒక షరతుని విధించారు శ్రీవారితో పాటు తనకి కూడా సమానంగా పూజలు జరపాలని కోరారు అందుకు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒప్పుకున్నారు. అలా తిరుమల కి వచ్చే భక్తులు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కంటే ముందు వరాహ స్వామి వారిని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. పురాతన తిరుమలకు సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలని సోషల్ మీడియాలో యూజర్లు షేర్ చేస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య ఏడుకొండల పై కొలువు తీరిన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందడంతో పాటుగా పర్యాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది.
Advertisement
ఆలయాలు చారిత్రక నిర్మాణాలు మొదలు జలపాతాలు, ఉద్యానవనాలు, వన్యప్రాణులు ఇలా ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తూ ఉంటాయి. తిరుమల వెళ్లే భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలు అన్నిటిని కూడా తిలకించవచ్చు. తిరుమల మణి మండప గంటలు, తిరుమల కోనేరు ఇలా రకరకాల ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలు అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు పై కూడా ఒక లుక్ వేసేయండి.
1.
2.
3.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!