Advertisement
Holi 2024: భారతదేశంలో ఎప్పటినుండో హోలీ పండుగని జరుపుకుంటూ వస్తున్నారు. చాలామంది హోలీ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈసారి హోలీ పండుగ మార్చి 25న వచ్చింది. హోలీ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు ఉత్సాహం కూడా. చిన్నారులు నుండి పెద్దల వరకు అందరు హోలీ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండగ నుంచి వాతావరణం లో మార్పులు మొదలవుతుంటాయి. హోలీ సంబరాలను కొత్తగా పెళ్లయిన వధువు అత్తవారింట్లో కాకుండా తల్లి ఇంట్లో జరుపుకోవాలని సాంప్రదాయం ఉంది. ఎందుకని కొత్త పెళ్ళికూతురు అత్తవారింట్లో హోలీ పండుగనే జరుపుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also read:
- Vastu Tips: వంటగదిలో ఈ మార్పులు చేసారంటే.. ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది..!
- Salim Baig : ఘర్షణ సినిమాలో నటించిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అయ్యిపోతారు..!
- Shriya Sharma: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా ? తాను ఏ లెవెల్లో ఉందొ చూస్తే హ్యాట్సాఫ్ అంటారు
హిందూ ఆచారాల ప్రకారం చూసినట్లయితే హోలిక దహనాన్ని అత్త కోడలు కలిసి చూస్తే వారి సంబంధం లో చీలిక వస్తుందని నమ్ముతారు. ఈ కారణంగా హోలీ వేడుకలని కొత్తగా పెళ్లయిన తర్వాత కోడలు అత్త కలిసి జరుపుకోరు. కోడలు అత్తవారి ఇంటి నుండి అమ్మ ఇంటికి వెళ్లిపోయి అక్కడ హోలీ పండుగని చేసుకుంటుంది. అందుకనే నవ వధువు అత్తతో కలిసి హోలీ పండగనే జరుపుకోదు. పెళ్లయిన కొత్తలో తల్లిదండ్రులతో కలిసి హోలీ వేడుకల్ని జరుపుకోవడం వలన ఆ కుటుంబంతో ఇంకోసారి కలిసి హోలీ పండుగను జరుపుకునే అవకాశం ఆమెకి దొరుకుతుంది. కొత్త అల్లుడు హోలీ వేడుకల్ని జరుపుకునేందుకు అత్త వారింటికి వస్తాడు హిందూ సంప్రదాయాల ప్రకారం అల్లుడికి ప్రత్యేక అతిథి మర్యాదలు చేస్తూ ఉంటారు. దీంతో హోలీ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది వాళ్ళ బంధం మరింత బలపడుతుంది.
Advertisement
కొత్త కోడలు పుట్టింట్లో హోలీ వేడుకలని జరుపుకోవడం వలన పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా అందంగా ఉంటారని కూడా నమ్ముతారు. కొత్త కోడలు గర్భవతిగా ఉంటే అప్పుడు హోలీ సంబరాలని తల్లి ఇంట్లో చేసుకుంటుంది. ఈ సమయంలో పుట్టింట్లో సందడి ఎక్కువ ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో అత్తవారింట్లో గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు అందుకని ఈ సంప్రదాయం పెట్టి ఉండవచ్చు. కొత్త కోడలు హోలీ పండుగ అమ్మ ఇంట్లో జరుపుకొని అత్తవారింటికి అడుగుపెట్టిన తర్వాత ఆమెతో ఆనందాలని తీసుకువస్తుందని అదృష్టన్ని తీసుకొస్తుంది అని కూడా అందరూ నమ్ముతారు. హోలీ నాడు పిల్లలు పెద్దలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా హానికరమైన కెమికల్స్ ఉండే రంగుల్ని ఉపయోగించకూడదు. వీలైనంతవరకు ఇంట్లోనే రంగులను తయారు చేసుకుని వాటిని మాత్రమే హోలీ ఆడుకోడానికి ఉపయోగించడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!