Advertisement
పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు.. ప్రస్తుతకాలంలో ఈ మాట పక్కదారి పడుతోంది.. సంబంధ బాంధవ్యాల మీద నమ్మకం లేకుండా పోతోంది.. పెళ్లిని కూడా ఒక బిజినెస్ గా మార్చుకుంటున్నారు తెలివి లేని కొంతమంది యువతీ, యువకులు. ఇటీవల కాలంలో మాత్రం అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారి దగ్గర ఉన్నది అంతా దోచి ఉడాఇస్తున్నారు. చివరికి అబ్బాయిలు మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి..
Advertisement
Also Read: క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన 10మంది నటీనటులు ఎవరంటే..?
తాజాగా మరొక సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. గుంటూరు చెందినటువంటి శ్రీనివాసరావు బీటెక్ పూర్తి చేసి మోటో కంట్రోలర్ మెకానిక్ గా వర్క్ చేస్తున్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలోనే రెవేన్యూ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి ద్వారా సంబంధం ఉందని తెలుసుకొని, అమ్మాయి ప్రియాని చూసి వచ్చాడు. చివరికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. అమ్మాయికి తండ్రి లేడు. దీంతో చలించిపోయిన శ్రీనివాస్ కట్నం ఏమీ తీసుకోకుండా, అమ్మాయికి రెండు లక్షల రూపాయలు పెట్టి బంగారం పెట్టాడు. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
పెళ్లికి బంధుమిత్రులందరిని పిలిచాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రియా మాత్రం ఏదో ఒక సాకు చెప్పి ప్రతిరోజు శ్రీనివాస్ ను దగ్గరకు రానివ్వకుండా దూరంగా పెట్టసాగింది. ఈ తరుణంలోనే తన తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పి పుట్టింటికి వెళ్ళింది. మూడు నెలలైనా ఇంటికి రాలేదు. ఏం జరిగిందని భర్త ఆరా తీస్తే, ప్రియాకు గతంలోనే ఒక యువకుడితో పెళ్లి జరిగిందని తెలిసింది. శ్రీనివాసు ఒక్కసారిగా కంగుతిన్నాడు. యువతి మోసం చేసిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.. ఈ విషయం చూసిన మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.
ALSO READ:
క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన 10మంది నటీనటులు ఎవరంటే..?