Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి స్వయంకృషితో వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరును తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటన అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఎంతోమంది చిరంజీవి నటనకి ఫిదా అయిపోయారు. చిరంజీవి సినిమాల్లోకి వెళ్తానని ముందు చెప్తే వాళ్ళ నాన్నగారు పెద్దగా వద్దని ఏమి చెప్పలేదు. ఆయనకి కూడా సినిమాల పిచ్చి. అందుకని తన కొడుకు ఇండస్ట్రీ లోకి వెళ్లడం మంచిదే అని ఆయన భావించారు.
Advertisement
కానీ ఒకవేళ కనుక సినిమాల్లో సక్సెస్ అవ్వకపోతే పరిస్థితి ఏంటో అని ఆలోచించి చదువుకోమని చెప్పారు. చిరంజీవి తన తండ్రి చెప్పినట్లే అనుసరించారు. కానీ ఆరు నెలల తర్వాత చదువు ని పక్కన పెట్టేశారు. ఇండస్ట్రీలో నెమ్మదిగా అవకాశాలను తెచ్చుకుని మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలని పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం సుధాకర్ అని చెప్పొచ్చు.
Advertisement
Also read:
- డెలివరీ బాయ్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..!
- చనిపోయే ముందు ఎక్కువగా ఇలాంటి మాటలే మాట్లాడుతారు..!
- ఘనంగా వెంకటేష్ రెండో కూతురి పెళ్లి.. ఫొటోస్ వైరల్..!
కమెడియన్ సుధాకర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కమెడియన్ సుధాకర్ అందరికీ సుపరిచితమే. సినిమాలో అవకాశం వచ్చినా కూడా యాక్టింగ్ కోర్స్ పూర్తి చేయకపోవడంతో మొదట చిరంజీవి నటించకూడదని అనుకున్నారు. సుధాకర్ సినిమా కోసం చెప్పగానే ఎందుకు యాక్ట్ చేయకూడదని అనుకుని పునాదిరాళ్లు సినిమాలో నటించారు చిరంజీవి సినిమా ఇంకా రాకముందే బాపు గారి దృష్టి చిరంజీవి మీద పడింది అలానే బాలచంద్ర గారు కూడా చిరంజీవి ని చూసారు. ఇలా నెమ్మదిగా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. అప్పటినుండి ఇప్పటివరకు తన నటనతో అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!