Advertisement
సినిమాటిక్ రేంజ్ లో ప్లాన్ చేసింది ఈ యువతి. చూస్తే నిజంగానే పోలీస్ అని అందరూ అనుకుంటారు. కానీ పెళ్లి కుదరడంతో అసలు విషయం మొత్తం బయటపడింది. ఇది చూసి ఊళ్ళో వాళ్ళు బంధువులు కూడా షాక్ అయిపోయారు. ఇంతలా ప్లాన్ చేసింది ఏంటీ పోలీస్ కాదా..? ఇక అసలు వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈమె పేరు మాళవిక. డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పోలీసు అవ్వాలనే లక్ష్యంతో పరీక్షలు కూడా రాసింది. పోలీస్ అయిపోతానని అందరికీ చెప్పింది కానీ ఫిజికల్ టెస్ట్ లో ఈమె ఫెయిల్ అయింది.
Advertisement
ఉద్యోగం రాలేదు. అయితే తన పరువు ఎక్కడ పోతుందా అని ఉద్యోగం చేస్తున్నట్లు పోలీస్ అయిపోయినట్లు అందర్నీ నమ్మించింది. అందుకోసం నకిలీ ఐడెంటిటీ కార్డులని తెచ్చుకుంది. దానితో పాటుగా యూనిఫామ్ కూడా తీసుకుంది. పోలీస్ అయిపోయినట్లు అందర్నీ నమ్మించింది. ఈమె ఇన్స్టాగ్రామ్ లో కూడా పోలీస్ యూనిఫామ్ తో ఉన్న ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ ఉండేది.
Also read:
Advertisement
- డెలివరీ బాయ్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..!
- చనిపోయే ముందు ఎక్కువగా ఇలాంటి మాటలే మాట్లాడుతారు..!
- ఘనంగా వెంకటేష్ రెండో కూతురి పెళ్లి.. ఫొటోస్ వైరల్..!
సోషల్ ఈవెంట్స్ లో కూడా ఆమె ఒక ఎస్ఐ లాగ వెళ్లి వచ్చేది ఇక్కడితో అంతా బానే మేనేజ్ చేసింది. కానీ ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి వాళ్ళు పై అధికారులతో ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. దీంతో మొత్తం డ్రామా అంతా కూడా బయటపడింది ఏడాది నుండి ఎస్సైగా డ్రామా ఆడుతున్న మాళవిక బండారం బయటపడింది దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తను కేవలం తన తల్లిదండ్రులు సంతోషం కోసం మాత్రమే ఇలా చేశానని అళవిక చెప్పింది యూనిఫామ్ వేసుకుని ఎడాది నుండి ఒక యువతి ఇంతలా మోసం చేసిందని అందరూ షాక్ అయిపోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!