Advertisement
చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆచార్య చానికి అనేక విషయాల గురించి చెప్పారు చాణక్య నీతిలో డబ్బుకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలని ప్రస్తావించారు. జీవితాన్ని సరళంగా సులభంగా మార్చుకోవడానికి డబ్బు అవసరమని చాణుక్య అన్నారు. డబ్బును చాలా త్వరగా నాశనం చేసే కొన్ని కార్యకలాపాలు ఉన్నాయని అన్నారు. ఈ అలవాట్లు మీకు తెలియకుండా మీ సంపదని పూర్తిగా నాశనం చేస్తాయని చాణక్య అన్నారు. చాణక్య ప్రకారం హింసించడం ఇతరులను కించపరచడం అలానే మతపరమైన కార్యకలాపాలు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే అది ఎక్కువకాలం ఉండదని చాణక్య అన్నారు.
Advertisement
అలా సంపాదించిన డబ్బు ఉండకపోవడమే మంచిది అని అన్నారు. ఒక వ్యక్తి ఎప్పుడూ అటువంటి సంపదని ఆశించకూడదని చాణక్య చెప్పారు. అలానే దొంగతనం లేదా మోసం ద్వారా సంపాదించిన డబ్బు కూడా ఎక్కువ కాలం నిలవదని చాణక్య అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు కొంతకాలం ఆనందాన్ని ఇస్తుంది కానీ ఎల్లప్పుడూ సంతోషం గా ఉండలేరని చాణక్య అన్నారు. అటువంటి డబ్బు కూడా త్వరగా మన నుండి వెళ్ళిపోతుందట చాణక్య ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ స్వార్థం అత్యాశతో ఉండకూడదని సంపదకి దేవత అయిన లక్ష్మీ స్వార్ధపరులు అత్యాశపరులకు దూరంగా ఉంటుందని చాణక్య అన్నారు.
Advertisement
Also read:
Also read:
పైగా ఇటువంటి వారి చేతిలో డబ్బు ఎక్కువ కాలం ఉండదని మితిమీరిన ఖర్చు ఆదాయానికి మించిన ఖర్చు ఉంటాయని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్య అన్నారు. ఎప్పుడూ కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చూసి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయాలి లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోనే ఉంటుంది. డబ్బుని మంచినీళ్లల్లా ఖర్చుపెట్టినట్లయితే లక్ష్మీదేవి కోప్పడి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. పేదలకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళని సంతోషంగా లక్ష్మీదేవి ఉంచుతుంది. దేవాలయాలకి డబ్బు ఇస్తే దైవానుగ్రహంను కురిపిస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!