Advertisement
కమల్ హాసన్ కూతురుగా శృతి హాసన్ ఇండస్ట్రీలోకి వచ్చారు. పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చాలామంది తారల జీవితాలు తెరమీద ఒకలా తెర వెనుక ఒకలా ఉంటాయి. శృతిహాసన్ గురించి కూడా చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. శృతిహాసన్ ప్రస్తుతం సింగల్ గా వుంటున్నారు. శృతిహాసన్ ఇప్పటికే చాలామందితో ప్రేమలో పడిందని అనేక వార్తలు వచ్చాయి. శృతిహాసన్ 2010లో సిద్ధార్ద్ ని ప్రేమించింది. ఏడాది పాటు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.
Advertisement
ఆ తర్వాత శృతిహాసన్ 2011 నుండి 2012 వరకు ధనుష్ తో ప్రేమలో ఉన్నారు ఆ తర్వాత ఏడాది నాగచైతన్యతతో కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించింది. కేవలం తన చెల్లిని ఒక ఈవెంట్ నుండి పికప్ చేసుకోలేదని, ఆ ఒక్క కారణంతోనే శృతిహాసన్ బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత నాగ చైతన్య శృతిహాసన్ తో 2016లో ప్రేమ మూవీలో నటించారు. 2014లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడే సమయంలో క్రికెట్ గ్రౌండ్లో శృతిహాసన్ ఉంటే తనకు గెలుపు వస్తుందని చెప్పే అంత దృఢంగా వాళ్ళ బంధం మారింది.
Advertisement
Also read:
Also read:
ఆ తర్వాత కొన్ని రోజులకే వాళ్ళ మధ్య సెట్ కాలేదని వార్తలు వచ్చి విడిపోయారు. 2016 నుండి 2019 వరకు మూడేళ్ల పాటు మైకేల్ కార్సెల్ పై ప్రేమ ఉండేది తర్వాత జీవితంలో ఎక్కువకాలం మైకేల్ తోనే ఉంది. అతనిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ బ్రేకప్ అయిపోయింది. తర్వాత 2021 సమయంలో శాంతను అనే ఒక డూడల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది కానీ వీళ్ళ ప్రేమ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!