Advertisement
అపరిచితుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. డబ్బింగ్ మూవీ అయినా కూడా మన సినిమా లాగా ఆదరించిన సినిమాల్లో అపరిచితుడు కూడా ఒకటి. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది కొత్తరకం వ్యాధిని జనాల్లోకి దర్శకుడు శంకర్ తీసుకువచ్చారు. విక్రమ్ నటన కూడా అదిరిపోయింది. ఆ పాత్రలో విక్రమ్ ని తప్ప ఇంకెవరిని కూడా అసలు ఊహించేకోలేము ఇప్పుడు కూడా అపరిచితుడు పేరు వినగానే అందరికీ విక్రమే గుర్తొస్తారు.
Advertisement
విక్రమ్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఈ మూవీ లో ఉంటుంది. అతనిలో ఉండే ముగ్గురు మనుషులతో ఒకతను అన్యాయం జరిగితే ఊరుకోడు. నరకంలో విధించే శిక్షలు రూపంలో నేరస్తులందరిని చంపుతాడు. అలాగే ఇంకో రెండు పాత్రలు కూడా అద్భుతంగా క్రియేట్ చేశారు. ఇందులో తనకి ఒక చెల్లి కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటే వర్షం వలన రోడ్డు మీద నిలిచిపోయిన నీటిలో కరెంటు వైర్ పడే విక్రమ్ ఇంకా వాళ్ళ చెల్లి తో పాటుగా కొంతమంది వస్తున్న వాహనం అదుపుతప్పి నీళ్లలో పడిపోవడంతో చెల్లెలు నీటిలో పడి కరెంట్ షాక్ కొట్టి చనిపోతుంది. దీంతో మానసికంగా బలహీనంగా అయిపోతాడు.
Advertisement
కరెంటు దగ్గర పనిచేసిన లైన్ మ్యాన్ ని అరెస్ట్ చేయకుండా కోర్టులో కూడా సరైన తీర్పు ఇవ్వకపోవడంతో విక్రమ్ కి తెలియకుండా మానసికంగా మార్పు వస్తుంది. ఈ క్లైమాక్స్ ని గమనిస్తే ఆ వ్యక్తిని ఎందుకు చంపుతాడు..? మీలో సగం మందికి దీని ఆన్సర్ తప్పుగా అనుకుంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తాగడం తప్పు అతను తాగాడు అందుకని విక్రమ్ చంపేస్తాడు అని చాలామంది అనుకుంటారు. ఆ వ్యక్తిని చంపడానికి అసలు కారణం తన చెల్లి చనిపోవడానికి గల కారణమైన లైన్మెన్ అతనే కనుక. కానీ చాలామంది ఈ విషయాన్ని తప్పుగా అనుకున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!