Advertisement
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు ఏదైనా సమస్య కలగడం లేదంటే ఇబ్బందులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు భార్య లేదా భర్తలు మార్పులు కూడా చూస్తూ ఉంటారు. మీ భార్యలో ఈ మార్పులు గమనించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. లైఫ్ పార్టనర్ కి సపోర్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం ఒత్తిడితో బాధపడుతున్నట్లు వాళ్లకు తెలియకపోయినా ఇతరులు ఈజీగా గుర్తిస్తారు. పని ఎక్కువైనప్పుడు భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు ఆర్థిక విషయాల్లో ఒత్తిడి లక్షణాలు కనబడతాయి. ఒత్తిడి ఎప్పుడో ఓసారి వస్తే పర్లేదు కానీ తరచు వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నట్లయితే అనేక సమస్యలు వస్తాయి.
Advertisement
ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరిగిపోతుంది గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. శరీరం బిగుసుకుపోయినట్లు ఉంటుంది. ఇటువంటి సమయంలో లోతగా శ్వాస తీసుకోవాలి. స్ట్రెస్ వలన ప్రతి ఒక్కరూ ఇలా బిహేవ్ చేయరు. కొంతమంది ఏ విషయం అయినా సరే తేలికగా తీసుకుంటారు. కొంతమంది మాత్రం సీరియస్ గా తీసుకుంటారు. అలానే శారీరిక శ్రమ తగ్గి ఒత్తిడి పెరగడం వలన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
Advertisement
Also read:
ఒత్తిడి వలన ఆలోచనలో మార్పులు వస్తుంది. ఏకాగ్రతని కూడా కోల్పోతారు. పని మీద శ్రద్ధ ఉండదు. పని చేయలేక పోతారు. బ్రెయిన్ విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూ ఉంటే కూడా ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు విసుగ్గా ఉంటారు. ఊరికే చిరాకు పడిపోతూ ఉంటారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఆందోళనకు గురవుతుంటారు. అలానే డిప్రెషన్ కి లోనవుతుంటారు. ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు ఒళ్ళు నొప్పులు, కండరాలు నొప్పులు, తలనొప్పి, తెల్లవారు నిద్ర లేకపోవడం, కాళ్లు చేతులు చల్లబడటం ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఆలోచించకుండా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువ కాకుండా చూసుకోవాలి శారీరిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండింటి మీద కూడా ధ్యాస పెట్టాలి మీ భార్య ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తే మీ భార్య ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!