Advertisement
ఎన్నికల ఫలితాల మీద కోనసీమలో పంచాంగ కర్తల విశ్లేషణలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ముందే చెప్తున్నామని తమకు ప్రొడక్షన్ విషయంలో క్రెడిబిలిటీ ఉందని చాలామంది అంటున్నారు. ఏపీకి సీఎం ఎవరో అవుతారో తేల్చి చెప్తున్నారు. కోనసీమకు చెందిన పంచాంగ కర్తలు నాయకుల జాతకాల ఆధారంగా లెక్కలు వేసి మరీ చెప్పేశారు. పైగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి కూడా చెప్పారు. ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే మంచిదో కూడా ఉచిత సలహాలు ఇచ్చారు.
Advertisement
వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తాడేపల్లిగూడెం కి చెందిన ప్రముఖ సిద్ధాంతకర్త పల్లవార్డుల శ్రీరామకృష్ణ శర్మ అన్నారు. జగన్ సీఎం అవుతారని చెప్పడమే కాకుండా టీడీపీకి 69 స్థానాలే వస్తాయని అన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెప్తే తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు.
Advertisement
Also read:
Also read:
ఇప్పుడు కూడా ఏపీలో తను చెప్పింది నిజం అని అన్నారు. అమలాపురానికి చెందిన ఇంకో పంచాంగ కర్త ఉపదృష్ట నాగాదిత్య టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని చెప్తున్నారు. పార్టీ ఏ కాదు నాయకులు జాతకాలకు ఈ నెల 9, 11 తేదీల్లో ప్రమాణ స్వీకారానికి మంచి రోజు అని అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!