Advertisement
అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని అందుకుంది. అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీకి దక్కింది కేవలం 11 మాత్రమే. కంచుకోట లాంటి నియోజకవర్గం కోల్పోయింది వైసీపీ విశాఖపట్నం రెండు, చిత్తూరు రెండు, కడప రెండు, ప్రకాశం 2 మాత్రమే వైసీపీ దక్కించుకోగలిగింది. మిగిలిన చోట్ల వైసిపి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. అటు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇదే ఫలితం కనబడింది. నాలుగు చోట్ల మాత్రమే వైసిపి గెలిచింది.
Advertisement
2019 నాటికి ఎన్నికల్లో టీడీపీకి లభించిన సీట్లు కంటే దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంది ఆ ఎన్నికల్లో 23 సీట్లను దక్కించుకుంది. టీడీపీ ఇప్పుడు పట్టుమని పది కూడా రాలేదు దీంతో వైసీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ అర్థమైంది ఐదేళ్లు తిరిగి చూసేసరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అని అంతా అనుకుంటున్నారు. ఈ ఓటమిని వైయస్ జగన్ అంగీకరించారు. ఫలితాలు వెలువడిన రోజు విలేకరులతో మాట్లాడారు పోరాటం తమకు కొత్త కాదని ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు.
Advertisement
Also read:
Also read:
ఈ ఓటమిపై ఐప్యాక్ స్పందించింది. వైఎస్ఆర్సిపి తో కలిసి ఇంకోసారి పని చేయడానికి 2024 ఎన్నికలు తమకు మంచి అవకాశాన్ని ఇచ్చాయని అంది. పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొని రావడానికి చెక్కుచెదరని సంకల్ప దీక్షతో ఈ ఎన్నికల్లో పనిచేశామని ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైయస్ జగన్ నాయకత్వం తమకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వైసీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఐప్యాక్.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!