Advertisement
చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య సూత్రాలు జీవితంలో సరిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. వీటి ద్వారా ఒక వ్యక్తి అనేక సమస్యలను నివారించవచ్చు. చాణక్యనీతిలో చాణక్యుడు స్త్రీలకు కొన్ని ప్రమాదకరమైన లక్షణాలని పేర్కొన్నారు. ఈ లక్షణాలని స్త్రీలు వదులుకోవాలని అన్నారు. అహం అనేది జీవితంలో పెద్ద శత్రువు. చాణక్యుడి ప్రకారం స్త్రీలు అహంభావానికి గురై గురైతే ఎంతో ప్రమాదకరమని అన్నారు.
Advertisement
స్త్రీలు అహం భావానికి దూరంగా ఉండాలి. అహం ఉన్న స్త్రీ ఇంటికి మంచిది కాదు. అహం వదిలిపెడితే ఆనందం అదృష్టం కలుగుతాయి. అహం ఉన్నవారి ఇంట్లో నివసించడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు అని చాణక్య అన్నారు. అలాగే అజ్ఞానంగా ఉండకూడదని చాణక్య అన్నారు. అజ్ఞానం చెడ్డ గుణం కాదు లోపం. స్త్రీ కి తెలివితేటలు చాలా ముఖ్యం. ఎందుకంటే కుటుంబం సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. కోపం చూపించడం మనుషులందరికీ కూడా అలవాటే. ప్రతి విషయంలో స్త్రీలు కోపగించుకోవడం మంచిది కాదు.
Advertisement
Also read:
Also read:
కోపాన్ని వదిలిపెట్టుకుంటేనే మంచిది. అతి స్వార్థం కూడా మంచిది కాదు. స్త్రీ తన జీవితాన్ని గడపడమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఆలోచించాలి ఇది అన్ని ఇళ్లల్లో కూడా ఉండదు. కొంతమంది మహిళలు కుటుంబ బాధ్యతను భారంగా భావిస్తారు. కొంతమందికి డబ్బు ఆస్తులు విషయంలో స్వార్థం ఉంటుంది. అలానే దురాశ ఉండకూడదు. అబద్దాలు చెప్పే అలవాటు ఉండకూడదు అని చాణక్య అన్నారు. ఈ అలవాటులను స్త్రీలు మార్చుకుంటే కచ్చితంగా సంతోషంగా ఉండచ్చని అన్నారు. కాబట్టి స్త్రీలు ఈ పొరపాట్లు చేయకుండా ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!