Advertisement
కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. వైసీపీ 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది. ఘోర ఓటమి వైసీపీకి ఎదురవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఫలితాలకు ముందు కొన్ని ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చినా వాటిని ఎవరూ నమ్మలేదు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన చోట్ల కూటమి ఘనవిజయాన్ని అందుకుంది. కేంద్రంలోని ఎన్డీఏకు జగన్ అవసరం ఉండదని రాజకీయ రాజకీయంగా జగన్ ఇబ్బంది పెడతారని గతంలో కేసులు మళ్ళీ తీస్తారని అంతా భావిస్తున్నారు.
Advertisement
ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని అంతా అంటున్నారు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కనబడలేదు దీనికి కారణం ప్రస్తుతం బీజేపీకి స్వల్ప మెజారిటీ మాత్రమే దక్కింది. 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మిత్రపక్షాల అవసరం చాలా ఉంది అలానే బయట నుండి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా ఉంది. రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు మోడీకి అవసరం. వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి. టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడంతో వైసిపి కీలకంగా మారుతుంది.
Advertisement
Also read:
Also read:
వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి జగన్ కి ఎటువంటి ముప్పు ఉండదని తెలుస్తోంది. ఇప్పుడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు 2026 జూన్ నెలకు నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. జూన్ 21వ తేదీ వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తయిపోతుంది. 2026 కి కానీ నాలుగు రాజ్యసభ స్థానాలను కూటమి ఖాతాలో పడతాయి. 2028 నాటికి వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ పదవి ఖాళీ అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండేటట్టు కనబడుతోంది. మరి ఏమవుతుందనేది చూడాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!