Advertisement
టాలీవుడ్ లో రోజురోజుకీ కొత్త టాలెంట్ పుట్టుకొస్తుంది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా మంది హీరోలు వస్తున్నారు.అటువంటి హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటనతో ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లైగర్ తో త్వరలోనే మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.సినిమా సినిమాకు క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. పెళ్లి చూపులు సినిమా నుంచి లైగర్ సినిమా వరకు విజయ్ ఎంత పారితోషికాన్ని అందుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పెళ్లి చూపులు : విజయ్ ఈ సినిమా కన్నా ముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని తోపాటు గా నటించాడు. కానీ పూర్తిస్థాయి హీరోగా చేసింది పెళ్లి చూపులు సినిమా లోనే. ఈ సినిమా కోసం విజయ్ అందుకున్న పారితోషికం 5 లక్షలు.
ద్వారక : పెళ్లి చూపులు సినిమా లాంటి డీసెంట్ హిట్ తర్వాత ద్వారక సినిమా చేశాడు విజయ్. కానీ ఈ కథ డైరెక్ట్ చేయడం లో లోపాలు ఉండి సినిమా తేడా కొట్టింది. ఈ సినిమా కోసం విజయ్ 20 లక్షలు తీసుకున్నాడు.
అర్జున్ రెడ్డి : వాస్తవానికి విజయ్ హీరోగా రెండో సినిమా ఇదేనట. కానీ షూటింగ్ లేట్ అవడంతో మూడో సినిమాగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా కోసం విజయ్ కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్నారట.
గీత గోవిందం: పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ పీస్ ఫుల్ లవ్ స్టోరీ కి కూడా కేవలం 5 లక్షలే తీసుకున్నాడట.
Advertisement
నోటా : విజయ్ చేసిన పొరపాటు ఈ సినిమా చేయడం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని ఒప్పుకున్నాడు. ఈ సినిమా కోసం విజయ 5 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు.
టాక్సీ వాలా : ఈ సినిమాతో దర్శకుడికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కోసం కూడా విజయ్ 5 కోట్లు తీసుకున్నాడు.
డియర్ కామ్రేడ్ : విజయ్ కెరీర్ లో మొదటి సారి సౌత్ లో అన్ని భాషల్లో విడుదలైన చిత్రం ఇది. అయితే ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఈ సినిమా కోసం మన రౌడీ హీరో 10 కోట్లు తీసుకున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్ : ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అనుకున్నారు. కానీ సినిమాలో ఏమీ లేకపోవడంతో ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఈ సినిమా కోసం కూడా విజయ్ 10 కోట్లు తీసుకున్నాడు.
లైగర్ : మొదటిసారి విజయ్ కెరియర్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్.ఈ సినిమా కోసం విజయ్ 12 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు. ఇదే విజయ్ కెరియర్లో అత్యధిక పారితోషికం కావడం విశేషం.
also read: