Advertisement
సామాన్య వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు తర్వాత జర్నలిజం, సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగానికి ఆయన సేవలు అందించిన రామోజీరావు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒకటి బయటకు వస్తున్నాయి. ఆయన ఆస్తులు విషయం కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 5 దశాబ్దాలుగా ఎన్నో రంగాల్లో తన మార్కును వేసుకున్నారు.
Advertisement
శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో ఆయన చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించిన విషయం తెలిసిందే. ఎన్నో రంగాల్లో ప్రభావాన్ని చూపించిన రామోజీరావు మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం పై అభిమానులు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన 1984 లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే మూవీతో నిర్మాతగా మారారు.
Advertisement
Also read:
ఎన్నో జోనర్లలో సినిమాలను నిర్మించారు. ఇప్పటిదాకా 85 చిత్రాలను అందించారు. అందులో దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. రామోజీరావు పేరు మీద 46 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది, ఫిలిం సిటీ పేరు మీద ఉన్న సినిమా స్టూడియోను ఆయన నిర్మించారు. ఇది 1666 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని విలువ ఎన్నో కోట్ల రూపాయలు ఉంటుంది. ఆయన నికర ఆస్తులు వేలకోట్ల విలువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కొడుకులు సమానంగా కొంత భాగాన్ని పంచేసారు. మిగిలిన ఆస్తులను తన భార్య పేరు మీద ఉంచారు. ఇప్పుడు వాటికి అధికారం ఆమెకు ఉంది, తర్వాత తన సంతానానికి చెందిన వీలునామా చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!