Advertisement
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. చాలా మంది ప్రతి ఏటా తిరుమల వెళుతూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమలకు ఏడు నడకదారులు ఉన్నాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. మరి ఆ నడకదారుల గురించి ఇప్పుడు చూద్దాం… సాధారణంగా మనకి తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి. శ్రీవారి మెట్ల మార్గం ఒకటి. ఈ రెండు మాత్రమే మనకి తెలుసు.
Advertisement
ఇవి కాకుండా మరో ఐదు వున్నాయి. తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కడప జిల్లా వాసులు గుంపులు గుంపులుగా ఈ మార్గంలో తిరుమల చేరుకుంటారు. హిందువులకి ఉన్న పుణ్యక్షేతాల్లో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం తిరుమల తిరుమలకు చేరుకోవాలంటే భక్తులు, బస్సులను, ప్రైవేట్ కారులను, కాలినడకన తిరుమల చేరుకుంటారు. ఎక్కువ మందికి తెలిసిన నడకదారి అలిపిరి. అసలు తిరుమలకు ఎన్ని మార్గాలు ఉండేవంటే ఏడు దారులు ఉండేవి.
Advertisement
వాటిలో మొదటిది ప్రధానమైనది అలిపిరి. తాళ్లపాక అన్నమాచార్యులు గొప్ప వైష్ణవ భక్తుడు వెంకటేశ్వర స్వామి వారిని అహోబిలంలోని నరసింహ స్వామిని ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రాశారు. మొదటిసారి ఆయన అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కారు. ఈ మార్గంలో తిరుమల చేరుకోవడానికి గంటన్నర సమయం పడుతుంది. 11 నుండి 12 కిలోమీటర్లు ఉంటుంది. రెండవది వచ్చేసి శ్రీవారి మెట్టు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి.
Also read:
Also read:
శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే మూడవది మామండూరు అడవి. నాలుగవది కుక్కల దొడ్డి నుండి తుంబుర తీర్థం, పాప వినాశనం మీదుగా ఈ దారి ఉంటుంది. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు అలానే ఐదవది రేణిగుంట నుండి అవ్వచారి కోన దారి. అలానే ఆరవది ఏనుగుల దారి ఏడవది తలకోన నుండి ఉన్న దారి. ఇలా మొత్తంగా ఏడు దారులు ఉన్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!