Advertisement
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. వీళ్ళతో పాటుగా 23 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ క్యాబినెట్ లో ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరూ మాత్రమే ఉంటారు. పవన్ తో పాటుగా 24 మంది మంత్రుల జాబితాను నిన్న అర్ధరాత్రి ప్రకటించారు. జనసేనకు మూడు బీజేపీకి ఒక స్థానాన్ని మంత్రివర్గంలో కేటాయించారు.
Advertisement
కొత్త మంత్రివర్గంలో యువనాయకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చారు సగానికి పైగా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వగా.. ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనార్టీల నుండి ఒకరికి అవకాశం ఇచ్చారు.
Also read:
Advertisement
Also read:
నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం లభించింది. బిజెపి నుండి ఒకరిని మంత్రిగా ఎంపిక చేశారు. ఇక వీళ్లల్లో కొత్త వాళ్ళు ఎవరనేది చూస్తే.. కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్. అలాగే పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్ , నిమ్మల రామానాయుడు, ఎస్ఎండి ఫరూక్ , ఆనం, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి తో పాటుగా బీసీ జనార్ధన రెడ్డి ,టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, గొట్టిపాటి రవికుమార్ , కందుల దుర్గేష్ ,గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కి కూడా అవకాశం లభించింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!